ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భారీ తుఫాను.. అడ్డంగా రెండు ముక్కలైన ఇల్లు..

ABN, First Publish Date - 2022-07-16T00:27:12+05:30

తుఫానులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. అవి మిగిల్చే నష్టాన్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. అమెరికాలో ఇటీవల తుఫాను సృష్టించిన విలయానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తుఫానులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. అవి మిగిల్చే నష్టాన్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. అమెరికాలో ఇటీవల తుఫాను సృష్టించిన విలయానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. భారీ గాలుల కారణంగా మేరీ ల్యాండ్‌(Maryland) రాష్ట్రంలోని ఓ ఇల్లు అడ్డంగా రెండు ముక్కలైపోయింది. ఇంటి రెండో అంతస్తును ఎత్తి నేలపై పడేసినట్టు సరిగ్గా మధ్యలో విరిగిపోయింది. కాలేజ్ పార్క్(college park) ప్రాంతంలో మంగళవారం ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. 


జర్నలిస్ట్ టామ్ రోస్సీ తొలుత ఈ దృశ్యాలను ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు అందులో ఉండేవారని చెప్పారు. తమ స్నేహితుడు అందులో ఉండగానే ఇలా జరిగిందని ఆ విద్యార్థులు తెలిపారు. ఆ సమయంలో తాము మరో చోట ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగామన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని అన్నారు. ఇక.. సమీపంలో ఉన్న చెట్లు ఏవీ ఆ ఇంటిపై కూలినట్టు కనిపించడం లేదని టామ్ చెప్పారు. ప్రమాదానికి ముందు ఆ ఇల్లు ఎలా కనిపించేదో వివరిస్తూ ఓ ఫొటో కూడా జత చేశారు. దీన్నిబట్టి..  భారీ గాలుల కారణంగానే ఇలా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. సుడిగాలుల కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని మొదట ఆయన భావించారు. అయితే..స్థానిక మీడియా మాత్రం తుఫాను గాలుల వల్లే ఈ అనూహ్య ఘటన జరిగిందని చెబుతోంది. దీంతో.. ఆశ్చర్యపోయిన ఆయన ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  





Updated Date - 2022-07-16T00:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising