ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళాలు పగలగొట్టి నా షాపు లోపలికి చొరబ్డారంటూ వ్యక్తి ఫిర్యాదు.. ఆ తరువాత దిమ్మతిరిగే షాక్..!

ABN, First Publish Date - 2022-08-07T04:10:38+05:30

తన షాపులోకి కొందరు బలవంతంగా చొరబడ్డారంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తన షాపులోకి కొందరు బలవంతంగా చొరబడ్డారంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిలిప్ కాట్సాబానిస్ అనే యువకుడు బుధవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేశాడు. తన షాపు తాళాలు ఎవరో పగలగొట్టి లోపలిని వెళ్లారని ఫిర్యాదు చేశాడు. వారిని వారించినా వినలేదని, దీంతో.. తన భార్యను దాక్కోమన్మని తాను చెప్పినట్టు పోలీసులకు వివరించాడు. అతడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు దొంగలు పడ్డ ఆనవాళ్లేవీ కనిపించలేదు. కానీ.. అక్కడ ఫిలిప్ దాచిపెట్టిన కొకెయిన్ మాత్రం కనిపించింది. దీంతో.. డ్రగ్స్ దాచిపెట్టిన నేరంపై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 


అంతకుమునుపు మార్చి లో కూడా ఓ వ్యక్తి ఇలాగే పోలీసులకు ఫోన్ చేసి చివరకు జైలు పాలయ్యాడు. తన వద్ద ఉన్న మాదకద్రవ్యాల నాణ్యతను పోలీసులతో పరీక్షించాలని భావించి అతడు వారికి ఫోన్ చేశాడు. స్థానికంగా ఉన్న ఓ బార్‌లో దాన్ని కొనుగోలు చేశానని అతడు చెప్పుకొచ్చాడు. అది నకిలీ డ్రగ్స్ అని తన నమ్మకమని, ఇతరులెవ్వరూ మోసపోకుండా ఉండేందుకే పోలీసులతో పరీక్షించాలని భావించినట్టు వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. 



Updated Date - 2022-08-07T04:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising