ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో వెయ్యి విమాన సర్వీసులు రద్దు..!

ABN, First Publish Date - 2022-08-06T05:14:36+05:30

అమెరికాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి(Cancelled).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి(Cancelled). ఎయిర్‌లైన్స్ సంస్థలు శుక్రవారం ఏకంగా వెయ్యి సర్వీసులను రద్దు చేసినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌అవేర్ తెలిపింది. న్యూయార్క్‌లోని లగ్వార్డియా, నెవార్క్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులతో పాటూ వాషింగ్టన్ డీసీ నగరం శివారులోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో పెద్ద సంఖ్యలో విమానా సర్వీసులు రద్దయ్యాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా 1240 విమానసర్వీసులు వాతావరణం అనుకూలించక(Bad weather) క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. గత ఆరు వారాల్లో ఈ స్థాయిలో సర్వీసులను అర్థంతరంగా ఆపేయడం ఇదే తొలిసారి. గురువారం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మొత్తం 370 విమానసర్వీసులను నిలిపివేసింది. మరో 1800 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇప్పటికే విమానయాన సంస్థలు పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్ వ్యవస్థలో జరుగుతున్న జాప్యాలు, అనుకూలించని వాతావరణం, సిబ్బంది కొరత కారణంగా అనేక సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. సర్వీసుల సంఖ్య తగ్గించేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఐరోపా దేశాల్లో విమానయాన రంగం కూడా ఇవే సమస్యలతో సతమతమవుతోంది.   

Updated Date - 2022-08-06T05:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising