ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: చెల్లిని చంపిన ఆరేళ్ల బాలుడు.. తల్లి నిద్రపోతుండగా దారుణం..

ABN, First Publish Date - 2022-07-29T01:45:15+05:30

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు పోగొట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు పోగొట్టుకుంది. అమెరికాలోని ఇండియానా(Indiana) రాష్ట్రంలోని మన్సీ(Muncie) నగరంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. తలకు బుల్లెట్ గాయంతో అచేతనంగా పడిఉన్న బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించినట్టు పోలీసులు తెలిపారు. తన కుమారుడే(6) అతడి చెల్లెల్ని ప్రమాదవశాత్తూ కాల్చి చంపాడని బాలుడి తండ్రి జేకబ్ గ్రేసన్ పోలీసులకు తెలిపాడు. తమ గదిలో ఉన్న లాకర్‌లోంచి గన్ను తీసుకుని బాలికపై కాల్పులు జరిపాడన్నాడు. తల్లి నిద్రలో ఉండగా లాకర్ తాళం చెవులు వెతికి పట్టుకుని లాకర్ తెరిచి గన్ను తీసుకున్నట్టు బాలుడు పోలీసులకు చెప్పాడు. 


మరోవైపు.. ఆ బాలుడు గతంలో ఓసారి తమ గదిలో ఉన్న లాకర్‌ను తెరిచినట్టు తల్లిదండ్రులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అంతేకాకుండా.. అతడికి తుపాకీ(హ్యాండ్‌ గన్) ఎలా వాడాలో తాము స్వయంగా నేర్పించామని భార్యభర్తలు చెప్పడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు.. దర్యాప్తు కోసం జేకబ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడి వాతావరణం చూసి షాకైపోయారు. ఇల్లంతా చెత్తాచెదారం, జంతు విసర్జితాలతో అపరిశుభ్రంగా కనిపించిందన్నారు. ఈ క్రమంలో అందరి వాగ్మూలం తీసుకున్న పోలీసులు చివరకు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. నిర్లక్ష్యంతో చిన్నారి మరణానికి కారణమయ్యారంటూ వారిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-07-29T01:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising