ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ohio: ఓహాయోలో దారుణం.. కాల్పులకు తెగబడ్డ నిందితుడు..నలుగురి మరణం

ABN, First Publish Date - 2022-08-08T03:18:46+05:30

పట్టపగలు ఇళ్లల్లోకి చొరబడి నలుగురిని కాల్చి చంపిన వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పట్టపగలు ఇళ్లల్లోకి చొరబడి నలుగురిని కాల్చి చంపిన వ్యక్తి కోసం ప్రస్తుతం ఓహాయో(Ohio) పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్టీఫెన్ మార్లోనే ఈ దారుణానికి తెగబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బట్లర్ టౌన్‌ షిప్‌లో(Butler township) నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులకు తెగబడటానికి కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మానసిక రుగ్మతతో కాల్పులకు తెగబడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. 


పోలీసుల ప్రకటన ప్రకారం.. దారుణానికి తెగబడ్డ వెంటనే మార్లో రాష్ట్రం దాటిపోయాడు. దీంతో.. వారు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. నిందితుడు వివరాలు తెలిసిన వారు తక్షణం తమకు సమాచారమివ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. మార్లోపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2020లో దోపిడీ, న్యూసెన్స్ కేసుల్లో అతడు దోషిగా తేలాడు. అతడి వద్ద ఆయుధం ఉందని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. అతడి సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణం ఉండే బట్టర్ టౌన్‌షిప్‌లో జరిగిన కాల్పుల ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. 

Updated Date - 2022-08-08T03:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising