ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో పోలీసులు పెట్టిన పోస్ట్ వైరల్.. నెజిజన్ల ప్రశంసల వర్షం!

ABN, First Publish Date - 2022-06-30T01:42:37+05:30

సోషల్ మీడియా పోలీసులు పెట్టిన ఓ పోస్టుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నెటిజన్లు ఆ పోస్ట్‌పై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీకు హ్యాట్సాప్’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. కాగా.. నెటిజనం అంతలా మెచ్చుకునేంత పోలీసులు ఏం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: సోషల్ మీడియా పోలీసులు పెట్టిన ఓ పోస్టుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నెటిజన్లు ఆ పోస్ట్‌పై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీకు హ్యాట్సాప్’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. కాగా.. నెటిజనం అంతలా మెచ్చుకునేంత పోలీసులు ఏం మంచి పని చేశారు? అని ఆలోచిస్తున్నారా? అయితే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్‌ స్క్వేర్ ప్రాంతం ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇంతటి రద్దీ ప్రదేశంలోకి దాదాపు 2వేల తేనటీగలు వచ్చి.. అక్కడ గూడును ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఉన్న రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు.. హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం చేస్తాయో అని భయం భయంగా గడుపుతున్నారు. అయితే ఈ తేనటీగల విషయం తాజాగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. వాటికి ఏ మాత్రం హాని చేయకుండా అక్కడి నుంచి తేనటీగలను తొలగించారు. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోలీసులు వెల్లడించారు. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Updated Date - 2022-06-30T01:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising