ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Family visas: ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్.. ఫ్యామిలీ వీసాలపై కువైత్ మరో సంచలన నిర్ణయం!

ABN, First Publish Date - 2022-08-18T14:01:05+05:30

ప్రవాసుల కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ వీసాల (Family visas )పై కువైత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ప్రవాసుల కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ వీసాల (Family visas )పై కువైత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఆరు గవర్నరేట్ల పరిధిలో ఫ్యామిలీ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అంతర్గత మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, దీని నుంచి వైద్యులతో పాటు ఇతర కొన్ని కేటగిరీలకు చెందిన నిపుణులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.


ఇంతకు ముందు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు వీసాలు జారీ చేసిన వారికి ఈ నిర్ణయం వర్తించదని పేర్కొన్నారు. రెసిడెన్సీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విజిట్ వీసా విధానాలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆరు గవర్నరేట్ల పరిధిలో ఫ్యామిలీ వీసాల జారీని నిలిపివేయాలని రెసిడెన్సీ అఫైర్స్ విభాగం స్పష్టం చేసింది.  

Updated Date - 2022-08-18T14:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising