ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India-UAE travel: సెలవులపై స్వదేశానికి వచ్చిన భారత ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్.. విమాన చార్జీలకు రెక్కలు!

ABN, First Publish Date - 2022-08-06T15:15:26+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి వేసవి సెలవులపై స్వదేశానికి వచ్చిన భారత ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

50శాతం వరకు విమాన చార్జీలు పెరిగే అవకాశం

ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి వేసవి సెలవులపై స్వదేశానికి వచ్చిన భారత ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్. ఈ నెల ఆఖరి వరకు విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. సుమారు 45 నుంచి 50 శాతం వరకు విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉందట. ఈ నెల చివరి వరకు భారతదేశంలోని వివిధ నగరాల నుండి యూఏఈకి భారీ సంఖ్యలో ప్రవాసులు తిరుగు పయనం కానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విమాన టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఏజెంట్లు చెబుతున్నమాట. ప్రధానంగా కొచ్చి, కొజికోడ్, చెన్నై, బెంగళూరు నుంచి విమాన టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయని, అందుకే ఈ నగరాల నుంచి టికెట్లకు బాగా డిమాండ్ ఉన్నట్లు చెప్పారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నుంచి కూడా అంతే డిమాండ్ ఉందట. 


ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ Musafir.com చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రహీష్ బాబు మాట్లాడుతూ.. భారత్‌లోని వివిధ నగరాల నుంచి యూఏఈకి వన్‌వే విమాన టికెట్  ఛార్జీలు ఆగస్టు 15వ తేదీ తర్వాత నుంచి 45-50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కేరళ సెక్టార్‌లోని గమ్యస్థానాలతో పాటు ముంబై నుంచి యూఏఈకి వన్‌వే విమాన టికెట్ల ధరలు ఆగస్టు 15వ తేదీ కంటే ముందు 1200 దిర్హమ్స్(రూ.25,943)గా ఉంటే.. ఆగస్టు 15-30 తేదీల మధ్య సగటున 1300-1900 దిర్హమ్స్(రూ. 28,105 నుంచి రూ.41వేలకు)కు పెరిగినట్లు వెల్లడించారు.

Updated Date - 2022-08-06T15:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising