ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

69 ఏళ్ల తరువాత పుట్టింటికి Air India.. ఉద్యోగుల గుస్సా!

ABN, First Publish Date - 2022-01-27T13:02:03+05:30

ఎయిరిండియా అమ్మ కం చరమాంకానికి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడే అప్పగింతలు!

న్యూఢిల్లీ: ఎయిరిండియా అమ్మ కం చరమాంకానికి చేరింది. ప్రభు త్వం గురువారం ఎయిరిండియాను లాంఛనంగా టాటా గ్రూప్‌నకు అప్పగిస్తున్నట్టు సమాచారం. దీంతో 69 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వా త, ఎయిరిండియా మళ్లీ టాటాల చేతికి వస్తుంది. టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ టాలేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గత ఏడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్ల బిడ్‌తో ఏఐని దక్కించుకుంది. గత ఏడాది డిసెంబరు నాటికే ఈ అప్పగింతల కార్యక్రమం పూర్తి కావాలి. అయితే కొన్ని లాంఛనాలు పూర్తి కావడంలో జాప్యంతో నెల రోజులు ఆలస్యంగా ఇది జరుగుతోంది. 


ఉద్యోగుల గుస్సా 

ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఇంకా గుర్రుగానే ఉన్నాయి. తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలకు ఏ మాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా  సహించేంది లేదని హెచ్చరిస్తూ ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ఐపీజీ), ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ)  ఎయిరిండియా సీఎండీ విక్రందేవ్‌ దత్‌కు ఘాటుగా లేఖ రాశాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకెళతామని హెచ్చరించాయి. అలాగే ప్రతి విమాన సర్వీసుకు ముందు విమాన సిబ్బంది బీఎంఐ తనిఖీ చేయాలన్న ఉత్తర్వులను కూడా ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. 


మూడో సంస్థ 

టాటా గ్రూప్‌ ఇప్పటికే ఎయిర్‌ ఏసి యా ఇండియా, విస్తారా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంలో ఈ రెండు విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయి రిండియా మూడోది అవుతుంది. టాటా గ్రూపు భవిష్యత్‌లో మిగతా రెండు విమానయాన సంస్థలను ఎయిరిండియా లో విలీనం చేస్తుందని భావిస్తున్నారు.


ఎల్‌ఐసీ అప్పులు క్లియర్‌

ఎయిరిండియా నుంచి రావలసిన రూ.3,800 కోట్ల బాకీలను ఎల్‌ఐసీ వసూలు చేసుకుంది. ప్రభుత్వ హామీ ఉన్న ఈ రుణాన్ని ఎల్‌ఐసీ మంచి లాభంతోనే విక్రయించినట్టు సమాచారం. ఎన్‌సీడీ రూపంలో ఉన్న ఈ రుణ పత్రాల్ని ఎల్‌ఐసీ నుంచి బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఐఆర్‌బీఏ నిబంధనల ప్రకారం ఎల్‌ఐసీ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌, రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు వీల్లేదు. ఎయిర్‌ ఇండియా ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్‌ చేతికి మారడంతో ఎల్‌ఐసీ ఈ రుణ పత్రాల్ని విక్రయించింది. 

Updated Date - 2022-01-27T13:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising