ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వరుడేమో ఆఫ్రికా సంతతి వ్యక్తి, వధువేమో భారతీయ మూలాలున్న వనిత.. పెళ్లిలో ఓ ఆసక్తికర సీన్..!

ABN, First Publish Date - 2022-06-24T02:47:37+05:30

భాష కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకే కాదు..అవతలి వారి మనసుల్లో సుస్థిరస్థానాన్ని కూడా ఇస్తుంది. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర దృశ్యం అమెరికాలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భాష కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకే కాదు..అవతలి వారి మనసుల్లో సుస్థిరస్థానాన్ని కూడా ఇస్తుంది. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర దృశ్యం అమెరికాలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో కనిపించింది. తన పెళ్లి వేడుకలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియోను భారత సంతతికి చెందిన యువతి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి కొడుకు చేసిన పనికి తన మనసు ఆనందంతో నిండిపోయిందని, సంతోషం కన్నీళ్ల రూపంలో ఉప్పొంగిందని చెప్పింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. 


 ఇంతకీ అతడు చేసిన పనేంటంటే.. పెళ్లి ప్రమాణాలను వధువు మాతృభాష మలయాళంలో చెప్పడమే! మలయాళం నేర్చుకోవడానికి ఎంత కష్టమైనప్పటికీ.. అతడు తన జీవనసహచరి మనసు గెలుచుకోవడం కోసం ఇలా చేశాడు. మొదట ఇంగ్లిష్‌లో మొదలుపెట్టిన అతడు.. ఆ తరువాత అందరూ ఆశ్చర్యపొయేలా మలయాళంలో మాట్లాడాడు. తనకు ఓ అమూల్యమైన నిధి దొరికిందంటూ మనసులోని ప్రేమనంతా బయటపెట్టేశాడు. కాబోయే భర్తనోట ఈ మాట.. అదీ మలయాళంలో వినిపించడంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన వధువు వలవలా ఏడ్చేసింది. కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్ల కూడా వరుడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ జంట కలకాలం ఆనందంగా ఉండాలంటూ దీవిస్తున్నారు.  



Updated Date - 2022-06-24T02:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising