ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: బహిరంగ ప్రదేశంలో అసభ్యకర ప్రవర్తన.. అరెస్ట్ చేయబోయిన పోలీసులకు చుక్కలు చూపించిన ఆఫ్రికన్ మహిళ!

ABN, First Publish Date - 2022-06-07T14:54:31+05:30

బహిరంగ ప్రదేశంలో అసభ్యకర ప్రవర్తనతో పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడిన ఓ ఆఫ్రికన్ మహిళను కువైత్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: బహిరంగ ప్రదేశంలో అసభ్యకర ప్రవర్తనతో పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడిన ఓ ఆఫ్రికన్ మహిళను కువైత్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సదరు మహిళ కువైత్ సెక్యూరిటీ అధికారులకు చుక్కలు చూపించింది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన అధికారులను చూసిన మహిళ నడిరోడ్డుపైనే తన ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా తీసేసింది. కేవలం లోదుస్తులపై నిలబడిపోయింది. ఒకవేళ తన దగ్గరకు వస్తే వాటిని కూడా తీసివేస్తానని పోలీసులను బెదిరించింది. దాంతో కొద్దిసేపు పోలీసులకు ఏం చేయాలో అర్థంకాలేదు. చివరకు ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఆమెపై బహిరంగంగా అనైతికత, అసభ్యతకు పాల్పడడం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని కువైత్ పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-07T14:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising