ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jackpot: అదృష్టమంటే ఈమెదే.. అమ్మ అడ్వైజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన కూతురు..!

ABN, First Publish Date - 2022-07-23T17:46:04+05:30

అమ్మ మాట కూతురిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తల్లి సలహాతో కూతురు సరదాగా ఆడిన ఆట కోట్లు తెచ్చిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్త్ కరోలినా‌: అమ్మ మాట కూతురిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తల్లి సలహాతో కూతురు సరదాగా ఆడిన ఆట కోట్లు తెచ్చిపెట్టింది. తల్లి సూచనతో కూతురు లాటరీ టికెట్ (Lottery Ticket) కొనుగోలు చేసి జాక్‌పాట్ (Jackpot) కొట్టింది. తల్లికూతురు కలిసి గ్రాసరీ షాప్‌కు వెళ్లిన సయమంలో వారికి అక్కడ లాటరీ బోర్డు కనిపించింది. దాంతో కూతురితో తల్లి సరదాగా ఒకసారి ఆడి చూడు అని సలహా ఇచ్చింది. అంతే.. అమ్మ అడ్వైజ్‌తో కూతురు 5డాలర్లు(రూ.400) పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేయడం, అదే టికెట్‌కు జాక్‌పాట్ తగలడంతో రూ.2 కోట్లు గెలుచుకుంది. ఇలా అమ్మ సలహాతో కూతురు రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina)లో 55 ఏళ్ల గినా డిల్లార్డ్‌ అనే మహిళ తన తల్లితో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో ఆమె మంగళవారం(ఈ నెల 19న) తల్లితో కలిసి మోక్స్‌విల్లేలోని ఏజే ఫుడ్ మార్ట్‌కు వెళ్లింది. 


ఆ సమయంలో వారికి అక్కడ 'ఫాస్ట్ ప్లే' లాటరీ గేమ్ బోర్డు కనిపించింది. అది చూసిన డిల్లార్డ్‌ తల్లి ఆమెకు సరదాగా ఒకసారి గేమ్ ఆడమని సలహా ఇచ్చింది. మొదట తల్లికి వద్దు అని చెప్పింది డిల్లార్డ్. ఎందుకంటే.. అంతకుముందు ఎప్పుడూ ఆమె ఆ ఆట ఆడలేదు. కానీ, అమ్మ చెప్పింది కదా అని ఆ తర్వాత మనసు మార్చుకుని సరదాగా 5 డాలర్లు(సుమారు రూ.400) పెట్టి డిల్లార్డ్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృ‍ష్టం వరించడంతో డిల్లార్డ్‌కు జాక్‌పాట్ తగిలింది. దాంతో 2,54,926 డాలర్లు(రూ.2కోట్లు) గెలిచింది. అంతే.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని మురిసిపోతోంది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. తాను గెలిచిన ఈ భారీ నగదులో కొంత భాగాంతో హోం, కారు లోన్స్ కట్టేస్తానని చెప్పింది. మిగతా మొత్తాన్ని దాచుకుంటానని చెప్పుకొచ్చింది. 

Updated Date - 2022-07-23T17:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising