ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitను వీడుతున్న ప్రవాసులు.. అదొక్కటే కారణం..

ABN, First Publish Date - 2022-07-17T16:11:47+05:30

ఉపాధి కోసం స్వదేశాన్ని వీడి.. ఎడారి దేశమైన Kuwaitకు వలస వెళ్లిన కార్మికులు క్రమంగా ఆ దేశాన్ని వీడుతున్నారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులే స్పష్టం చేస్తున్నారు. అందుకు సంబంధించిన గణాంకాలను తాజాగా వెళ్లడించారు. ప్రవాసులు పెద్ద మొత్తంలో కువైత్‌ను విడటానికి గల కారణం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం స్వదేశాన్ని వీడి.. ఎడారి దేశమైన Kuwaitకు వలస వెళ్లిన కార్మికులు క్రమంగా ఆ దేశాన్ని వీడుతున్నారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులే స్పష్టం చేస్తున్నారు. అందుకు సంబంధించిన గణాంకాలను తాజాగా వెళ్లడించారు.  ప్రవాసులు పెద్ద మొత్తంలో కువైత్‌ను విడటానికి గల కారణం.. అక్కడి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కఠిన నిబంధనలే. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ సహకారంతో రూపొందించిన గణాంకాలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తాజాగా విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. 60ఏళ్లు దాటిన ప్రవాసులు పెద్ద మొత్తంలో కువైత్‌ను వీడుతున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే సుమారు 4000 మందికిపైగా ప్రవాస కార్మికులు దేశాన్ని వీడినట్టు నివేదిక వెల్లడించింది. 60ఏళ్లు పైబడిన కార్మికులు వర్క్‌పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడానికి అధిక మొత్తంలో ఖర్చు అవడమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. వర్క్ పర్మిట్‌లను పూర్తి చేసుకోవడానికి సుమారు 800 కువైటీ దినార్లు ఖర్చు అవుతుండటంతో.. ఆ ఆర్థిక భారాన్ని భరించలేక ప్రవాసులు కువైత్‌ను వీడుతున్న స్పష్టం చేసింది.


Updated Date - 2022-07-17T16:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising