ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి పరిస్థితుల్లో ముందుగా Visa, Passportలలో ఏది ముందుగా రెన్యువల్ చేసుకోవాలంటే..

ABN, First Publish Date - 2022-06-27T17:38:40+05:30

భారతీయులు చాలా వరకూ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం UAE వెళ్తారు. రెసిడెన్సీ వీసా(Residency Visa) ద్వారా అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటారు. అయితే అలా వెళ్లిన వారిలో చాలా మందికి Passpor

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయులు చాలా వరకూ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం UAE వెళ్తారు. రెసిడెన్సీ వీసా(Residency Visa) ద్వారా అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటారు. అయితే అలా వెళ్లిన వారిలో చాలా మందికి Passport‌కు వ్యాలిడిటీ 6 నెలల కంటే తక్కువ ఉన్న సమయంలో గడువు దగ్గర పడిన రెసిడెన్సీ వీసాను రెన్యువల్ చేసుకోవచ్చా? లేదా? అనే విషయంపై స్పష్టత ఉండదు. అటువంటి సందర్భాల్లో Visa, Passportలలో ఏది ముందుగా రెన్యువల్ చేసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాన్ని పరిశీలిస్తే..



పాస్‌పోర్ట్‌కు వ్యాలిడిటీ ఆరు నెలల కంటే తక్కువగా ఉండి, అదే సమయంలో రెసిడెన్సీ వీసా గడువు కూడా దగ్గర పడిన సందర్భాల్లో.. ముందుగా పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే రెసిడెన్సీ వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఉదహరణకు ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ గడువు.. ఐదు నెలల్లో ముగుస్తుంది. ఇదే సమయంలో అతడి రెసిడెన్సీ వీసాకు గడువు కేవలం నెల మాత్రమే ఉంది. ఇటువంటి సందర్భంలో సదరు వ్యక్తి.. ముందుగా పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వీసా రెన్యువల్‌కు అప్లై చేసుకోవాలి. దీనిపై మరింత స్పష్టత కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఏ)ను సంప్రదించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. 


Updated Date - 2022-06-27T17:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising