ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌కు చేరుకున్న 92 ఏళ్ల భారతీయ వృద్ధురాలు..

ABN, First Publish Date - 2022-07-18T03:17:04+05:30

పాకిస్థాన్‌లోని తన పూర్వీకుల ఇంటిని చూడాలన్న ఓ 92 ఏళ్ల వృద్ధురాలి కోరిక దాదాపు 75 ఏళ్ల తరువాత తీరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పాకిస్థాన్‌లోని(Pakistan) తన పూర్వీకుల ఇంటిని(Ancestral home) చూడాలన్న ఓ 92 ఏళ్ల వృద్ధురాలి కోరిక దాదాపు 75 ఏళ్ల తరువాత తీరింది. ఇటీవల పాక్‌ ప్రభుత్వం మూడు నెలల పరిమితి గల వీసా జారీ చేయడంలో పాక్‌కు చేరకున్న రీనా ఛిబ్బర్(Reena Chibbar)..శనివారం తన పూర్వీకుల ఇంటిని చూసుకుని మురిసిపోయారు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో వారి పూర్వీకుల ఇల్లు ఉంది. అటారీ-వాఘా సరిహద్దు గుండా రీనా ఛిబ్బర్ పాక్ వెళ్లారు. ఆ ఇంటిని చూడగానే ఆమెకు నాటి రోజులు గుర్తుకొచ్చాయి. భారత్-పాక్ రావల్పిండి నగరం విభిన్న సంస్కృతుల వేదికగా ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. విభజన సందర్భంగా ఆమె తన కుటుంబంతో ఇండియాకు వచ్చేశారు. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. 


ఇండియాకు వచ్చినా కూడా.. తను పెరిగిన ఇల్లు, ఇరుగుపొరుగు వారు, తాను ఆడుకున్న వీధుల తాలుకు గుర్తులు మాత్రం తన మదిలోంచి చెరిగిపోలేదన్నారు. పాక్‌కు వెళ్లేందుకు 1965లో తాను చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పారు. అప్పట్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. ఇటీవల పాక్ ప్రభుత్వం వీసా జారీ చేయడంతో దాదాపు 75 ఏళ్ల తరువాత ఆమె కోరిక తీరింది. వీసా ఆంక్షలు తొలగించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-07-18T03:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising