ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తుపాకీతో ఎంటరైన దొంగలకు చుక్కలు చూపించిన 80ఏళ్ల వృద్ధుడు!

ABN, First Publish Date - 2022-08-04T00:34:29+05:30

తుపాకీ చేతిలో పట్టుకుని.. బెదిరిస్తే సాధారణంగా ఎవ్వరైనా సరే హడలిపోతాం. కానీ వృద్ధుడు మాత్రం ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన సమయస్పూర్తితో దొంగలకు చుక్కలు చూపించాడు. తోక ముడుచుకుని వచ్చిన దారి వెంటే పరుగులు తీసేలా చేశాడు. ప్రస్తుతం అం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తుపాకీ చేతిలో పట్టుకుని.. బెదిరిస్తే సాధారణంగా ఎవ్వరైనా సరే హడలిపోతాం. కానీ వృద్ధుడు మాత్రం ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన సమయస్పూర్తితో దొంగలకు చుక్కలు చూపించాడు. తోక ముడుచుకుని వచ్చిన దారి వెంటే పరుగులు తీసేలా చేశాడు. ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియో.. నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి ఆ వృద్ధుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కాలిఫోర్నియా(California)లోని నార్కో(Norco) నగరంలో 80ఏళ్ల వృద్ధుడు సొంతంగా ఓ లిక్కర్ స్టోర్‌(liquor store)ను నడుపుతున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం షాప్‌కు వెళ్లగా.. ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి స్టోర్‌లోకి ఎంటర్ అయ్యాడు. అనంతరం వృద్ధుడికి గన్ గురిపెట్టి.. ‘హ్యాండ్స్ అప్’ అంటూ అరవడంతో తొలుత అతడు షాకయ్యాడు. తర్వాత ఆ షాక్‌ నుంచి వెంటనే తేరుకున్న వృద్ధుడు.. మెరుపు వేగంతో కౌంటర్‌లో ఉన్న గన్ తీసి దొంగపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో దొంగ(robber) చేతికి గాయం అయింది. దీంతో దొంగ అక్కడి నుంచి పరుగులు తీశాడు. పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కారులో తన సహచరులతో కలిసి పరారయ్యాడు. 



కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు(CC Camera) పరీశీలించారు. అనంతరం ముగ్గరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగపై కాల్పులు జరిపిన తర్వాత సదరు వైన్ షాప్ ఓనర్.. గుండె పోటుతో బాధపడ్డాడు. అయితే ఆ షాపులో పని చేస్తున్న సిబ్బంది.. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ Viral in Social Meida) కావడంతో నెటిజన్లు సదరు వృద్ధుడు చూపిన ధైర్యానికి ఫిదా అవుతున్నారు. 




Updated Date - 2022-08-04T00:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising