ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: తండ్రి నిర్లక్ష్యం.. 8ఏళ్ల బాలుడి చేతిలో ఏడాది చిన్నారి బలి!

ABN, First Publish Date - 2022-06-30T00:03:45+05:30

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన ఓ పొరపాటు కారణంగా 8ఏళ్ల బాలుడి చేతితో ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో చిన్నారి ఆసుపత్రి పాలైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. తండ్రిని అదుపులోకి తీసుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన ఓ పొరపాటు కారణంగా 8ఏళ్ల బాలుడి చేతితో ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో చిన్నారి ఆసుపత్రి పాలైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జైలు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫ్లోరిడాకు చెందిన 45ఏళ్ల రాడెరిక్ డ్వేన్ రాండాల్ అనే వ్యక్తికి 8ఏళ్ల కొడుకు ఉన్నాడు. రాండాల్ తాజాగా తన గాళ్‌ఫ్రెండ్‌‌.. ఆమె ఇద్దరు కూతుళ్లను వెంటపెట్టుకుని పెన్సకోలాలోని హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌కు రాండాల్ తన కొడుకుని కూడా తీసుకెళ్లి.. ఓ రూమ్ బుక్ చేశాడు. అనంతరం ఓ పని మీద అతడు హోటల్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో 8ఏళ్ల బాలుడికి తండ్రి తుపాకీ దొరికింది. దాన్ని ఆట వస్తువుగా భావించిన ఆ బాలుడు.. తండ్రి గాళ్‌ఫ్రెండ్ కూతుళ్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. రెండేళ్ల వయసున్న మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాగా.. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హోటల్‌కు చేరుకుని రాండాల్‌ను అరెస్ట్ చేసి, సెక్షన్లపై అతడిపై కేసు నమోదు చేశారు. 



ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 8ఏళ్ల బాలుడు కాల్పులు జరుపుతున్న సమయంలో.. రాండాల్ గాళ్‌ఫ్రెండ్ గదిలో నిద్రపోతున్నట్టు చెప్పారు. కుమారుడు కాల్పులు జరిపినట్టు తెలిసి రాండాల్ వెంటనే హోటల్‌కు చేరుకున్నాడని పేర్కొన్నారు. అనంతరం అతడు.. కుమారుడి చేతిలోంచి తుపాకీ తీసుకుని, ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను సురక్షితంగా భద్రపరచకపోవడం, ఆధారాలను నాశనం చేయాలని చూడటం వంటి కారణాలతో పలు సెక్షన్ల కింది అతడిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. 


Updated Date - 2022-06-30T00:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising