ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు.. అమెరికాలో ఒకేసారి 768 కిలోమీటర్ల మేర మెరిసిన ఆకాశం

ABN, First Publish Date - 2022-02-03T13:00:27+05:30

వర్షం కురిసేటప్పుడు ఆకాశంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. అయితే, ఇలా వచ్చిన ఓ మెరుపు అసాధారణంగా ఒకేసారి 768 కిలోమీటర్ల మేర మెరిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔరా..!! ఎంతపెద్ద మెరుపో

న్యూయార్క్‌: వర్షం కురిసేటప్పుడు ఆకాశంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. అయితే, ఇలా వచ్చిన ఓ మెరుపు అసాధారణంగా ఒకేసారి 768 కిలోమీటర్ల మేర మెరిసింది. 2020 ఏప్రిల్‌ 29న అమెరికాలోని మిసిసిప్పి, లుసియానా, టెక్సాస్‌ రాష్ట్రాల మీద ఆకాశం ఒకేసారి మెరిసిందని వరల్డ్‌ మెటిరియాలాజికల్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూఎంవో) మంగళవారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా తాము రికార్డు చేసిన మెరుపుల్లో విస్తీర్ణంపరంగా ఇదే అతి పెద్దదని తెలిపింది.


2018 అక్టోబర్‌31న బ్రెజిల్‌ దక్షిణ భూభాగంలోని ఆకాశంలో 709 కిలోమీటర్ల మేర వచ్చిన మెరుపు ఇన్నాళ్లు తొలి స్థానంలో ఉండేది. కాగా, 2020లో ఆకాశంలో మరో అద్భుతం కూడా జరిగింది. సాదారణంగా మెరుపులు ఒకటి రెండు సెకన్లు మాత్రమే ఉంటాయి. కానీ, 2020 జూన్‌ 18న అర్జెంటీనాలో వచ్చిన ఓ మెరుపు 17.102 సెకన్ల పాటు వెలుగులు విరజిమ్మింది. అత్యంత ఎక్కువసేపు మెరిసిన మెరుపుగా ఇది రికార్డులకెక్కింది. 2019 మార్చి 4న అర్జెంటీనాలోనే 16.73 సెకన్ల పాటు వచ్చిన మెరుపును ఇది అధిగమించింది. ఆర్‌ సిరీ్‌సకు చెందిన జియోస్టేషనరీ ఆపరేషనల్‌ ఇన్వరాన్మెంటల్‌ శాటిలైట్లు(జీఎల్‌ఎమ్స్‌).. లైటెనింగ్‌ మ్యాపింగ్‌ టెక్నాలజీ ద్వారా ఈ గణాంకాలను నమోదు చేశాయని డబ్ల్యూఎంవో పేర్కొంది.

Updated Date - 2022-02-03T13:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising