ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఏడాది వ్యవధిలో 75వేల మంది డొమెస్టిక్ వర్కర్స్ వెనక్కి.. అయినా టాప్‌లోనే భారత్

ABN, First Publish Date - 2022-04-12T14:00:58+05:30

కువైత్‌లో రోజురోజుకు డొమెస్టిక్ వర్కర్ల కొరత ఎక్కువ అవుతోంది. దీనికి కారణం కరోనా సమయంలో భారీగా గృహకార్మికులు స్వదేశాలకు వెళ్లిపోవడమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో రోజురోజుకు డొమెస్టిక్ వర్కర్ల కొరత ఎక్కువ అవుతోంది. దీనికి కారణం కరోనా సమయంలో భారీగా గృహకార్మికులు స్వదేశాలకు వెళ్లిపోవడమే. తాజాగా వెలువడిన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2020 డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఏడాది వ్యవధిలో ఏకంగా 75వేల మంది డొమెస్టిక్ వర్కర్లు కువైత్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ నాటికి దేశంలో మొత్తం 6,68,000 మంది గృహకార్మికులు ఉంటే.. 2021 డిసెంబర్ వచ్చేసరికి ఆ సంఖ్య 5,93,684కి పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలో 75,684 మంది డొమెస్టిక్ వర్కర్లు తగ్గిపోయారు.  


ఇక తాజాగా గణాంకాల ప్రకారం కువైత్‌లో ఉన్న గృహకార్మికుల్లో అత్యధికులు భారతీయ ప్రవాసులేనని సమాచారం. 2021 డిసెంబర్ నాటికి కువైత్‌లో 2,79,000 మంది భారతీయులు డొమెస్టిక్ వర్కర్లుగా పని చేస్తున్నారు. భారత్ తర్వాత ఫిలిప్పీన్స్ 1,35,400 మంది గృహకార్మికులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్(76,800), శ్రీలంక(64,400), నేపాల్(11,451), ఇథియోపియా(10,689), ఇండోనేషియా(2,407), బెనిన్(1,583), పాకిస్థాన్(1,580), సుడాన్(1,331) ఉన్నాయి.  

Updated Date - 2022-04-12T14:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising