ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Expats in Kuwait: 68 మంది ప్రవాసుల అరెస్ట్.. వీరిలో 20 మంది ఏం చేశారో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-21T15:06:24+05:30

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రవాసులు ఉండే ప్రాంతాల్లో వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా క్రమం తప్పకుండా దాడులు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారితో పాటు అసాంఘీక చర్యలకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతోంది. ఇదే కోవలో తాజాగా అహ్మదీ (Ahmadi) గవర్నరేట్ పరిధిలో అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) నిర్వహించిన తనిఖీల్లో 48 మంది ప్రవాసులు పట్టుబడ్డారు. వారందరూ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా దేశంలో ఉంటున్నట్లు గుర్తించారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అంతర్గత తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు నివాస చట్టాలను (Residency Law) ఉల్లంఘించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.


వ్యభిచారం నిర్వహిస్తున్న మరో 20 మంది అరెస్ట్

అహ్మదీ, ఫర్వానియా (Farwaniya) గవర్నరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మరో 20 మంది ప్రవాసులను అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 20 మంది గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం (Prostitution) నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో 14 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. 


Updated Date - 2022-08-21T15:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising