ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Texas: అగ్రరాజ్యంలో విషాద ఘటన.. ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు!

ABN, First Publish Date - 2022-06-28T16:37:47+05:30

అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన సంచలనం రేపింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ట్రాక్టర్-ట్రైలర్‌లో 46 మంది వలసదారులు చనిపోయారని టెక్సాస్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది.యూఎస్-మెక్సికో సరిహద్దులో మానవ అక్రమ రవాణాలో అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటని నగర అగ్నిమాప..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్ (అమెరికా): అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన సంచలనం రేపింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ట్రాక్టర్-ట్రైలర్‌లో 46 మంది వలసదారులు చనిపోయారని టెక్సాస్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది.యూఎస్-మెక్సికో సరిహద్దులో మానవ అక్రమ రవాణాలో అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటని నగర అగ్నిమాపక విభాగం తెలిపింది. శాన్ ఆంటోనియో ఫైర్ డిపార్ట్‌మెంట్ ట్రైలర్‌లో కనిపించిన మరో 16 మందిని హీట్ స్ట్రోక్‌తో అనారోగ్యానికి గురవడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురు మైనర్‌లు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్ నగర దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కును కనుగొన్నారు. మృతదేహాలు ఉన్న ట్రక్కు చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్సులు కనిపించాయి. శాన్ ఆంటోనియో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.


మరణించిన వారంతా అక్రమ వలసదారులని భావిస్తున్నారు. శాన్ ఆంటోనియో పోలీసు అధికారులు ట్రక్కు డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. డ్రైవరు ట్రక్కును గుర్తించక ముందే దానిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ట్రక్కులో ఉన్న వలసదారులు ఊపిరాడక పోవడంతో మరణించారని ట్విట్టర్‌లో టెక్సాస్‌లో విషాదం అని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ తెలిపారు. ఆ ట్రక్కులోని రిఫ్రిజిరేటర్లలో నీరు లేదు. ఎయిర్ కండీషన్ కూడా పని చేయడం లేదు. మరోపక్క  శాన్ ఆంటోనియోలో సోమవారం 39.4 సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వీరంతా ఊపిరాడకో.. ఎండ వేడికో ప్రాణాలు కోల్పోయి ఉంటారని మార్సెలో తెలిపారు. ఇటీవల యూఎస్-మెక్సికో సరిహద్దు వద్ద రికార్డు సంఖ్యలో వలసదారులు దాటారు. 




Updated Date - 2022-06-28T16:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising