ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో ఓ మహిళకు భరించలేనంత కడుపునొప్పి.. ఆస్పత్రికి వెళ్తే టెస్టులు చేసి పొట్టలో ఏముందో చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..

ABN, First Publish Date - 2022-09-14T18:02:39+05:30

సౌదీ అరేబియాలో ఓ మహిళ భరించలేనంత కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టెస్టులు నిర్వహించ నివ్వెరపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఓ మహిళ భరించలేనంత కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టెస్టులు నిర్వహించ నివ్వెరపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియాలోని అల్ జౌఫ్ (Al Jouf) ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో (stomach pain) బాధపడుతుంది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు చికిత్స కోసమని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదట మహిళను పరీక్షించిన వైద్యులకు ఆమెను కడుపు నొప్పికి గల కారణమెంటో తెలియలేదు. దాంతో పొట్టను స్కానింగ్ చేయాలని నిర్ణయించారు. 


వెంటనే స్కానింగ్ చేయడంతో అందులో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె పొట్టలో భారీగా వెంట్రుకలు (Hair) ఉండడం చూసి వైద్యులు నివ్వెరపోయారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ నిర్వహించి, పొట్టలో ఓ గుట్టమాదిరిగా పేరుకుపోయిన వెంట్రుకలను బయటకు తీశారు. వాటి బరువు సుమారు 3కిలోలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, అవి ఆమె పొట్టలో ఎలా చేరాయి అనే విషయాన్ని మాత్రం వైద్యులు వెల్లడించలేదు.     

Updated Date - 2022-09-14T18:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising