ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New York లో దారుణం.. ఓ NRI కుటుంబంలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి..!

ABN, First Publish Date - 2022-06-22T00:41:55+05:30

న్యూయార్క్‌(New york) నగరంలో శుక్రవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారతీయ కుటుంబం అసువులు బాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: న్యూయార్క్‌(New york) నగరంలో శుక్రవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారతీయ కుటుంబం అసువులు బాసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. మంటలను ఆర్పిన తరువాత సిబ్బంది.. ఇంటి సెల్లార్‌లోని రెండు మృతదేహాలను గుర్తించారు. మరుసటి రోజు మూడో మృతదేహం వారికి లభించింది. ఈ ప్రమాదంలో నంద బాలో పర్సోద్ , బోనో సాలిమా దంపతులతో పాటూ వారి కుమారుడు(22) దేవోన్ పర్సోద్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు.


స్థానిక పోలీసులు ఈ ప్రమాదాన్ని ఫై అలార్మ్ ఫైర్‌గా వర్గీకరించారు. ప్రమాద సమయంలో గాలుల కారణంగా మంటలు  మరో నాలుగు ఇళ్లకు కూడా వ్యాపించాయన్నారు. ఇక నంద పర్సోద్ ఓ మెడికల్ కంపెనీలో పనిచేయగా.. ఆయన భార్య జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసేవారు. వారి కుటుంబం క్వీన్స్ బరో ప్రాంతంలో ఉండేదని బోనో సాలిమా సోదరుడు అబీద్ అలీ మీడియాకు తెలిపారు. గయానా నుంచి వలసొచ్చిన భారతీయ సంతతి వారు ఆ ప్రాంతంలో అధికంగా ఉంటారు. కాగా.. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అనేక మంది ఆన్‌లైన్‌లో విరాళాలు ఇస్తున్నారు. 

Updated Date - 2022-06-22T00:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising