ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీలో చదువుతూనే ఏడాదికి రూ.43 లక్షల సంపాదిస్తున్న 21 ఏళ్ల American యువతి.. అసలేం చేస్తోందంటే..

ABN, First Publish Date - 2022-06-26T23:49:40+05:30

కాలేజీ చదువులయ్యాక లక్షలు, కోట్లు వేతనాలిచ్చే ఉద్యోగాలు పొందుతున్నారు నేటి యువత! అయితే.. అమెరికాలోని ఓ యువతి మాత్రం కాలేజీలో చదువుకుంటూనే ఏడాదికి రూ.43 లక్షలకు పైగా సంపాదిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కాలేజీ చదువులయ్యాక లక్షలు, కోట్లు వేతనాలిచ్చే ఉద్యోగాలు పొందుతున్నారు నేటి యువత! అయితే.. అమెరికాలోని ఓ యువతి మాత్రం కాలేజీలో చదువుకుంటూనే ఏడాదికి రూ.43 లక్షలకు పైగా సంపాదిస్తోంది. 12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ ఇంత భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కోటీశ్వరుల కడుపున పుట్టి కూడా ట్యూషన్లు చెబుతున్న ఆమె జీవితంలోకి ఓమారు తొంగి చూస్తే.. 


సింగపూర్‌లో పుట్టిన పెరిగిన టాన్.. ప్రస్తుతం చికాగో యూనివర్శిటీలో ఎకనామిక్స్ అండ్ డాటా ఎనలిటిక్స్‌లో గ్రాడ్యుయేట్ కోర్సు చేస్తోంది. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమె ట్యూషన్లు చెప్పుకుంటూ భారీగా పాకెట్ మనీ సంపాదిస్తోంది. 2021లో ఆమె 55 వేల డాలర్లు(రూ.43 లక్షలకు పైనే..) ఆర్జించింది. ఇంటర్నేషనల్ బాక్కలారియేట్‌ కరిక్యులమ్‌లో 12వ తరగతి చదువుతున్న ఇంటర్నేషనల్ విద్యార్థులకు ఆమె ఇంగ్లిష్ సాహిత్య పాఠాలు చెబుతుంది. 2016లో టాన్ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. అయితే.. సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా ఇలా పాకెట్ మనీ కోసం కష్టపడటమేంటని తనను తరచూ మిత్రులు అడుగుతుంటారని ఆమె చెప్పింది. కానీ.. ఆ సంపన్న బ్యాక్‌గ్రౌండే తనను సంపాదన వైపు మళ్లేలా చేసిందని వివరించింది.


అపార సంపదను చూసిన తనకు ధనార్జన కూడా ఓ బాధ్యతే అన్న స్పృహ చిన్నప్పుడే కలిగిందని చెప్పుకొచ్చింది. అప్పట్లో హోల్‌సేల్ షాపుల్లో తక్కువ రేట్లకు దుస్తులు కొని తన ఇంటి సమీపంలో వారికి అమ్మేదాన్నని చెప్పుకొచ్చింది టాన్. ఆ అలవాటే కాలేజీకి వచ్చాక కూడా కొనసాగిందని వివరించింది. అయితే.. తన చదువుకయ్యే ఖర్చంతా తల్లిదండ్రులే చూసుకుంటుండటంతో తాను ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు వాడుకుంటుంటానని చెప్పింది. షాపింగ్, సినిమాలపైనే తన సంపాదన అధికంగా ఖర్చు చేస్తానని చెప్పింది టాన్. 


షాంఘాయ్ నగరంలోని(చైనా) విద్యార్థులకు టాన్ ట్యూషన్ చెబుతుంటుంది. ఆమె ఉంటున్న చికాగోకు చైనాకు టైం తేడా ఉండటంతో ప్రతి శుక్రవారం అదీ అర్ధరాత్రి సమయాల్లో ఆమె క్లాసులు తీసుకోవాల్సి వస్తోంది. కాలేజీలో చేరిన కొత్తలో ఈ పరిస్థితి కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆ తరువాత అలవాటు పడ్డానని తెలిపింది. ఇలా క్రమశిక్షణతో పని చేయడం తన జీవితానికి ఓ స్థిరత్వాన్ని కూడా ఇచ్చిందని చెప్పింది. సంపన్నురాలై ఉండి ఇలా కష్టపడుతున్న టాన్‌పై తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తుంటారు. 

Updated Date - 2022-06-26T23:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising