ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE travel: యూఏఈ నివాసితులకు 12 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ

ABN, First Publish Date - 2022-07-27T14:56:10+05:30

యూఏఈ పాస్‌పోర్ట్ (Passport) కలిగిన రెసిడెంట్స్‌కు డజను దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry), వీసా-ఆన్-అరైవల్‌ (visa on arrival) సదుపాయాలను అందిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యూఏఈ (UAE) నివాసితులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యూఏఈ పాస్‌పోర్ట్ (Passport) కలిగిన రెసిడెంట్స్‌కు డజను దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry), వీసా-ఆన్-అరైవల్‌ (visa on arrival) సదుపాయాలను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని అత్యంత ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. ఇక ఈ 12 దేశాల్లో ఏడు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry)కి అనుమతిస్తే.. మరో ఐదు దేశాలు వీసా ఆన్అరైవల్‌  (visa on arrival) ఫెసిలిటీ కల్పించాయి. యూఏఈకి చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ Musafir.com చెప్పిన వివరాల ప్రకారం.. జార్జియా, మాల్దీవులు, సీషెల్స్, మారిషస్, కజకిస్థాన్, సెర్బియా, జోర్డాన్ దేశాల్లో యూఏఈ నివాసితులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నట్లు వెల్లడించింది. 


అలాగే అర్మేనియా, అజర్‌బైజాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్థాన్(Kyrgyzstan), థాయిలాండ్, అల్బేనియాలో వీసా ఆన్‌అరైవల్ సౌకర్యాన్ని కల్పించాయని తెలిపింది. ఇక గత వారం విడుదలైన హెన్లీ అండ్ పార్ట్నర్స్(Henley & Partners) పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో యూఏఈ పాస్‌పోర్ట్ 15వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ పాస్‌పోర్టుతో వీసా లేకుండా ఏకంగా 176 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(GCC)లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ యూఏఈదే. యూఏఈ బలమైన పాస్‌పోర్ట్, అధిక తలసరి ఆదాయం దేశంలోని ప్రవాసులకు ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుండి వీసాలు పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.  

Updated Date - 2022-07-27T14:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising