ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో రోజుకు 11వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు

ABN, First Publish Date - 2022-01-16T18:52:40+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో రోజురోజుకు ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో రోజురోజుకు ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ట్రాఫిక్ విభాగం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 2021 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 4,03,608 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అంటే రోజువారీగా సరాసరి 11వేల ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో చాలా వరకు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. కూడళ్లలో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వాహనదారులు చేసే ప్రతి చిన్న ఉల్లంఘన కూడా రికార్డు అవుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం పేర్కొంది. కనుక వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం మంచిదని సూచించింది. అటు ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ జరిమానాలను భారీగా పెంచిన వాహనదారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.   

Updated Date - 2022-01-16T18:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising