ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుది అంకానికి చేరుకున్న Haj Pilgrimage.. మండుటెండలో 10 లక్షల మంది నమాజు

ABN, First Publish Date - 2022-07-09T13:26:32+05:30

హజ్‌ యాత్రలో భాగంగా ముస్లింలు మండుటెండను సైతం లెక్క చేయకుండా శుక్రవారం నమాజు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హజ్‌ యాత్రలో భాగంగా ముస్లింలు మండుటెండను సైతం లెక్క చేయకుండా శుక్రవారం నమాజు చేశారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర తుది అంకానికి చేరుకుంది. 5 రోజుల యాత్రలో రెండో రోజు అరాఫా కార్యక్రమంలో 10 లక్షల మంది పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,500 మందితో సహా భారత్‌ నుంచి 79 వేల మంది భక్తులు హజ్‌ యాత్రలో ఉన్నారు. శుక్రవారం 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సైతం లెక్క చేయకుండా భక్తులు అరాఫా ప్రసంగాన్ని విన్నారు. 14 శతాబ్ధాల క్రితం మహ్మద్‌ ప్రవక్త ఇదే పర్వత క్షేత్రంలో ప్రసంగించారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం అరాఫాపర్వత ప్రాంతాల్లో స్ర్పింకర్ల ద్వారా చల్లటి నీటిని చల్లింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 8 వేల మంది, చండీగఢ్‌ నుంచి అత్యల్పంగా 25మంది ఈ యాత్రకు వచ్చారు. మక్కాలో భారతీయులకు ఏర్పాట్లను కేంద్ర హజ్‌ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్లా పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2022-07-09T13:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising