ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాల్లో ఉండగానే ఆగిపోయిన విమానం ఇంజన్.. బ్రిడ్జిపై అత్యవసర ల్యాండింగ్.. ! చివరకు..

ABN, First Publish Date - 2022-05-16T01:45:57+05:30

అమెరికాలోని మియామీ రాష్ట్రంలో శనివారం ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని మియామీ నగరంలో శనివారం ఓ ప్రైవేటు విమానం అగ్నికి ఆహుతైంది. గాల్లో ఉండగానే ఇంజన్ ఫెయిలవడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఓ వంతెనపై దించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అటువైపు వెళుతున్న ఓ కారును ఢీకొనడంతో విమానంలో మంటలు రేగాయి. ఈ క్రమంలో విమానం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మియామీ డేడ్ కౌంటీలోని హాలోవర్ ఇన్‌లెట్ బ్రిడ్జి  వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో అత్యవసర సిబ్బంది వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా.. విమాన ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా పౌరవిమానయాన శాఖ ధ్రువీకరించింది. సెస్నా విమానం కూలిపోయినట్టు పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని తెలిపింది. 





Updated Date - 2022-05-16T01:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising