ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Counselling : పసికందుల్లో కామెర్లు ఎందుకు?

ABN, First Publish Date - 2022-12-21T23:44:28+05:30

72% నుంచి 80% మంది పిల్లలకు పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన రెండవ రోజు నుంచే మొదలవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడే పుట్టిన పసికందుల్లో కామెర్లు ఎందుకు కనిపిస్తాయి? ఇలాంటి పిల్లలను ఎండ సోకేలా ఉంచితే కామెర్లు తగ్గిపోతాయా? ఒకవేళ తగ్గకపోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బ తింటుందా?

72% నుంచి 80% మంది పిల్లలకు పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన రెండవ రోజు నుంచే మొదలవుతాయి. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో కామెర్లు పెరిగి, వారాంతంలోగా తగ్గిపోతాయి. పసికందుల్లో పుట్టుకతో తలెత్తే అధిక శాతం కామెర్లకు చికిత్స అవసరం ఉండదు. స్వతహాగానే కామెర్లు తగ్గిపోతాయి. పసికందుల్లో కనిపించే కామెర్లు పెద్దల కామెర్లలాంటివి కావు. ఈ కామెర్లకు కాలేయంతో సంబంధం ఉండదు. పుట్టిన వెంటనే పరిస్థితులకు అలవాటుపడే క్రమంలో పసికందుల శరీరంలో జరిగే మార్పుల ఫలితంగానే కామెర్లు కనిపిస్తాయి. కాబట్టి సాధారణంగా చికిత్సతో పని లేకుండానే వారంలోగా సర్దుకుంటాయి. కానీ కొందరు పిల్లల్లో కామెర్లు విపరీతంగా వస్తాయి. ముఖం, ఛాతీలతోపాటు కాళ్లూ, చేతులు కూడా పసుపు పచ్చగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు ఫొటోథెరపీ లైట్స్‌ పెట్టి కామెర్లను తగ్గించవచ్చు. పిల్లల మూత్రం కూడా పచ్చగా ఉండి, మలం తెల్లగా ఉండి, కామెర్లు రెండు వారాలకు మించి కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

ఇలాంటి కామెర్లు తల్లీబిడ్డల రక్తగ్రూపు విభేదించినప్పుడు కనిపిస్తాయి. తల్లిది నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఉండి, బిడ్డది పాజిటివ్‌ ఉన్నా, తల్లిది ఓ పాజిటివ్‌ ఉండి, బిడ్డ రక్తం ఎ లేదా బి పాజిటివ్‌ ఉన్నా...పుట్టే పిల్లలకు కామెర్లు విపరీతంగా వస్తాయి. పిల్లలకు కామెర్లు ఉండటం మూలంగా తల్లి పత్యాలు చేయవలసిన అవసరం లేదు. ఎటువంటి భయాలకు లోనవకుండా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వవచ్చు. అయితే పిల్లలకు ఏ రకం కామెర్లు వచ్చాయనేది మాత్రం గమనించుకోవాలి. ఎండలో ఉంచినా కామెర్లు తగ్గకుండా, వారానికి మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పుట్టుకతో కామెర్లు కనిపించిన పిల్లలను కచ్చితంగా నాలుగు, ఐదు రోజులకు వైద్యుల చేత పరీక్ష చేయించాలి. ఇక ఎండలో పెడితే ఎంతటి కామెర్లయినా తగ్గిపోతాయిలే! అనుకుంటే పొరపాటు. కామెర్లు తగ్గటానికి ఎండ కొంత మేరకే తోడ్పడుతుంది.

డాక్టర్‌ దినేష్‌ కుమార్‌ చిర్ల

పీడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌,

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-12-21T23:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising