..ఏ కమ్మని తేనెలు తెచ్చావో!
ABN, First Publish Date - 2022-11-16T04:34:49+05:30
కృష్ణ రాకతో పాటమ్మ కొత్తందాలు తెచ్చుకుంది. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా’ అని మన హీరో పాడుకుంటే ‘నమస్తే సుస్వాగతం..
కృష్ణ రాకతో పాటమ్మ కొత్తందాలు తెచ్చుకుంది. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా’ అని మన హీరో పాడుకుంటే ‘నమస్తే సుస్వాగతం.. సమస్తం నీ అధీనం’ అని దాసోహమైంది. ‘నా ఆమని పులకింత నీవే.. నా నీడగా ఉంది నీవే’ అని ఆరాధించుకుంది. ‘నువ్వు రాకాపోతే తంటా.. నన్ను చూడు నీకడగంటా’ అంటూ ‘ఓ హంసబలె రామచిలకా ఓ రబ్బీ’ అంటూ గారాలు పోయింది. ‘మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం.. వెన్నెల పారిజాతాలు.. వానకారు సంపెంగల’ను పొదుముకొని సింగారించుకుంది. ‘నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే జివ్వు మంటోంది మనసు’ అంటూ పరవశించింది. ‘నా దాహం తీరనిదీ.. నేనొక ప్రేమ పిపాసిని’ అని విరహంతో గొంతెత్తింది. ‘వహవ్వా.. నీ రాజసం.. వహవ్వా నీ పౌరుషం’ అంటూ కొనియాడింది. ‘నీకు నేనుంటా వెయ్యేళ్లు తోడుగా నీడగా..’ అంటూ బాస చేసింది. ఆయన ‘ఆకాశంలో ఒక తార’గా మారిపోయేసరికి ‘చుక్కల తోటలో ఎక్కడున్నావో’ అని ఆర్తిగా నలుదిక్కులా వెతుకుతోంది. కృష్ణ హిట్‌సాంగ్స్‌లో కొన్ని..
ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే (నేనేంటే నేనే)
పొంగింది పొంగింది బంగారు భూమి (బంగారు భూమి)
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే (మంచి మిత్రులు)
మావూళ్లో ఒక పడుచుంది.. దయ్యమంటే భయమన్నది (అవేకళ్లు)
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో (బుర్రిపాలం బుల్లోడు)
వస్తాడు నా రాజు ఈ రోజు (అల్లూరి సీతారామరాజు)
తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా (అల్లూరి సీతారామరాజు)
ముక్కు పుడక పెట్టుకో మాలక్ష్మిలా.. సిగన పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా (పల్నాటి సింహం)
మధువనిలో రాధికవో.. మధువొలికే గీతికవో (అల్లరి బావ)
చుక్కల తోటలో ఎక్కడున్నావో.. పక్కకు రావే (అల్లరి బుల్లోడు)
నేనొక ప్రేమ పిపాసిని.. నీవొక ఆశ్రమ వాసివి (ఇంద్ర ధనస్సు)
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు (పండంటి కాపురం)
ఇదిగో తెల్లచీర.. ఇదిగో మల్లెపూలు (ఊరికి మొనగాడు)
ఆకాశంలో ఒక తార.. నా కోసమొచ్చింది ఈవేళ (సింహాసనం)
నమస్తే సుస్వాగతం.. సమస్తం నీ అధీనం (కిరాయి కోటిగాడు)
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే (కుమార్ రాజా)
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా (చుట్టాలొస్తున్నారు జాగ్రత్త)
వెన్నెలైనా చీకటైనా.. చేరువైనా దూరమైనా (పచ్చని కాపురం)
మ్రోగింది కల్యాణ వీణ.. (కురుక్షేత్రం)
తనివి తీరలేదే.. నా మనసు నిండలేదే (గూడుపుఠాణి)
ఎక్కడో చూసిన జ్ఞాపకం.. ఎన్నడో కలిసిన జ్ఞాపకం (మహా సంగ్రామం)
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా (మాయదారి మల్లిగాడు)
కోలోకోలో కోయిలమ్మా.. కొండాకోనా బుల్లెమ్మా (నంబర్‌వన్)
Updated Date - 2022-11-16T04:34:50+05:30 IST