ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు తగ్గించే పానీయాలు!

ABN, First Publish Date - 2022-06-22T09:16:25+05:30

బరువు తగ్గాలనుకుంటే నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్‌ ఈటింగ్‌ మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు తగ్గాలనుకుంటే నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్‌ ఈటింగ్‌ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ శరీర బరువును పెంచేవే! కాబట్టి కంటి నిండా నిద్రకు తోడ్పడే ఈ పానీయాలను నిద్రకు ముందు తాగుతూ ఉండాలి.


పాలు: పాలలోని ట్రిప్టోఫాన్‌, క్యాల్షియం, కెసీన్‌ ప్రొటీన్‌లు గాఢ నిద్రలోకి జారుకునేటందుకు దోహదపడతాయి. కెసీన్‌ జీర్ణప్రక్రియను నెమ్మదింపజేసి గాఢ నిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడతుంది. ఫలితంగా పరోక్షంగా కండరాలు బలపడి, ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది.

ద్రాక్ష రసం: గాఢ నిద్ర పట్టడంతోపాటు, నిద్రావస్థలో కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో ఇన్సులిన్‌ స్రావాన్ని క్రమపరిచి, శరీర గడియారం కరెక్టుగా పని చేసేలా తోడ్పడతాయి.


దాల్చిన చెక్క తేనీరు: దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో తయారుచేసిన తేనీరు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. అలాగే శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దాంతో కూడా శరీర బరువు తగ్గుతుంది. 


మెంతుల నీళ్లు: మెంతులు నానబెట్టిన నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరిగి, బరువు పెరగకుండా ఉంటాం! బరువు తగ్గడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం కూడా మెంతుల నీళ్లు తాగాలి. అయితే నిద్రకు అరగంట ముందు తాగినప్పుడే ఈ ప్రయోజనాలు దక్కుతాయి.

Updated Date - 2022-06-22T09:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising