ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటీన్లు కావాలా బాబూ!

ABN, First Publish Date - 2022-06-29T09:42:05+05:30

ప్రొటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మన కణాలకు, కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాలలోను ప్రొటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలలో ప్రొటీన్లతో పాటుగా కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినటం వల్ల ప్రొటీన్లతో పాటుగా కొవ్వు కూడా చేరుతుంది. అందువల్ల ప్రొటీన్లు అదనంగా కావాల్సిన వారు ఈ కింది ఆహారపదార్థాలు తినాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. 


గుడ్లు 

ప్రొటీన్లు అదనంగా కావాల్సిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రొటీన్లను మన శరీరం వంద శాతం వినియోగించుకుంటుంది. అంతే కాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 


తోఫు

సోయాబీన్‌లను బాగా నానపెట్టి.. వాటి నుంచి తోఫును తయారు చేస్తారు. తోఫులో మన శరీరానికి తప్పనిసరిగా కావాల్సిన తొమ్మిది అమినో యాసిడ్స్‌ ఉంటాయి. అంతే కాకుండా దీనిలో ఐరన్‌, కాల్షియం కూడా ఎక్కువే ఉంటుంది. గుండె జబ్బులు, ఓస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారమిది. 


పిస్తా

పిస్తాలో ప్రొటీన్‌తో పాటుగా ఫైబర్‌ కూడా ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినటం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. 

 

పప్పుధాన్యాలు

పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా వంటి పప్పుధాన్యాలలో ప్రొటీన్‌ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పుధాన్యాల్లో 18 గ్రాముల ప్రొటీన్‌, 15 గ్రాముల ఫైబర్‌ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రోజూ క్రమం తప్పకుండా పప్పుధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు. 

Updated Date - 2022-06-29T09:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising