ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నీకి ముందే టోల్‌ లెక్క

ABN, First Publish Date - 2022-06-18T09:35:32+05:30

మనకు వాహనం ఉన్నంత మాత్రాన జాతీయ రహదారిపై కులాసాగా వెళదామంటే కుదరదు. మధ్యలో టోల్‌గేట్స్‌ ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకు వాహనం ఉన్నంత మాత్రాన జాతీయ రహదారిపై కులాసాగా వెళదామంటే కుదరదు. మధ్యలో టోల్‌గేట్స్‌ ఉంటాయి. అక్కడ లెక్క ప్రకారం టోల్‌ కట్టాల్సి ఉంటుంది. అలాగే అన్ని చోట్ల టోల్‌ రేట్లు ఒకేలా ఉండవు. ఎక్కడికక్కడ రేట్లు మారుతుంటాయి. 

అయితే మనం వెళ్లాల్సిన లొకేషన్‌ను సెర్చ్‌ చేసి పెట్టుకోగానే గూగుల్‌ మ్యాప్స్‌ దారిలో ఉన్న టోల్స్‌ అన్నింటినీ లెక్కగట్టి  చెబుతుంది. నేవిగేటింగ్‌ ఆరంభానికి ముందే చెల్లించాల్సిన టోల్‌ మొత్తం అంచనా వస్తుంది. టోల్‌ రేటుని టోల్‌ పాస్‌తో, అలాగే అది లేకుండా చూపుతుంది. పేమెంట్‌ విధానాన్ని అనుసరించి వేర్వేరు  రేట్లు ఉంటాయి. అలాగే టోల్‌గేట్‌ను తప్పించుకుని వెళ్ళే రూట్స్‌ని సైతం చూపుతుంది. ‘అవైడ్‌ టోల్స్‌’ ఆధారంగా ఆ పని కూడా నెరవేర్చుకోవచ్చు. అయితే ఈ సదుపాయం మన దేశంలో కొన్ని రూట్లకు మాత్రమే ఉంది. 

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో రెండు వేల రూట్లకు సంబంధించి టోల్‌ రేట్లు కనిపిస్తున్నాయి. ఇండియాకు తోడు అమెరికా, జపాన్‌, ఇండోనేసియాలకు చెందిన రహదారులు కవర్‌ అయ్యాయి. అందువల్ల మన దేశంలో ఏయే రహదారులు కవర్‌ అయ్యాయన్నది వెల్లడి కావాల్సి ఉంది.  

Updated Date - 2022-06-18T09:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising