ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులితో ఫైటింగ్‌... ఆ న్యూస్‌ కోసం వెయిటింగ్‌!

ABN, First Publish Date - 2022-01-23T07:12:52+05:30

ముంబైలోని చండీవాలీ స్టూడియోలో అమితాబ్‌ నటించే ‘ఖూన్‌ పసీనా’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఆ రోజు ఆయన పులితో ఫైట్‌ చేసే సీన్‌ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాకేశ్‌కుమార్‌. పులితో పైటింగ్‌ అంటే మాటలు కాదుగా! అది ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలీదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలోని చండీవాలీ స్టూడియోలో అమితాబ్‌ నటించే  ‘ఖూన్‌ పసీనా’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఆ రోజు ఆయన పులితో ఫైట్‌ చేసే సీన్‌ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాకేశ్‌కుమార్‌. పులితో పైటింగ్‌ అంటే మాటలు కాదుగా! అది ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలీదు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఫైట్‌లో పాల్గొన్నారు అమితాబ్‌. కానీ ఆయన మనసు మాత్రం వినబోయే వార్త కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే డెలీవరి కోసం జయా బచ్చన్‌ ఆస్పత్రిలో చేరారు. పుట్టబోయేది మగబిడ్డా, ఆడబిడ్డా అనే వార్త కోసం ఎదురుచూస్తున్నారు అమితాబ్‌. కాసేపటికి మగపిల్లాడు పుట్డాడని ఆస్పత్రి నుంచి తీపి కబురు రావడంతో ఇక టెన్షన్‌ వదిలిపెట్టి పులి ఫైట్‌లో నిమగ్నమయ్యారు అమితాబ్‌. అలా ఆ రోజు పుట్టినబిడ్డే అభిషేక్‌ బచ్చన్‌. 

ఖూన్‌ పసీనా చిత్రం విడుదలయి, మొన్న శుక్రవారానికి 45 ఏళ్లు. ఈ చిత్రంలో వినోద్‌ ఖన్నా, రేఖ కూడా నటించారు. ఇదే చిత్రాన్ని ఎన్టీఆర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో ‘టైగర్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. ‘శివ’ పేరుతో రజనీకాంత్‌ హీరోగా తమిళంలో తీశారు.

Updated Date - 2022-01-23T07:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising