ఈ టెక్ ప్రొడక్ట్స్ మార్కెట్ నుంచి అవుట్
ABN, First Publish Date - 2022-12-31T04:09:16+05:30
పుట్టినవాడు గిట్టక తప్పదు అనే సామెత టెక్నాలజీకీ వర్తిస్తుంది. ఏటా కొన్ని కొత్త ప్రొడక్టులు, సాఫ్ట్వేర్లు పుట్టుకువచ్చి జనాల్ని అలరిస్తాయి.
పుట్టినవాడు గిట్టక తప్పదు అనే సామెత టెక్నాలజీకీ వర్తిస్తుంది. ఏటా కొన్ని కొత్త ప్రొడక్టులు, సాఫ్ట్వేర్లు పుట్టుకువచ్చి జనాల్ని అలరిస్తాయి. అదే సమయంలో మరికొన్ని ఉత్పత్తులకు కాలం చెల్లుతుంది. మొత్తం వ్యవహారం పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చిన చందంగా ఉంటుంది. అలా ప్రస్తుత సంవత్సరంలో కనుమరుగు అవుతున్న వాటిని చూద్దాం.
ఐపాడ్ టచ్: ప్రపంచవ్యాప్తంగా యూజర్లను అలరిం చిన ఉత్పత్తి ఇది. ఇరవై సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చింది. ఐఫోన్-ఐపాడ్ హైబ్రిడ్ డివైస్ ఇంకెంతమాత్రం ఉండబోవడం లేదని యాపిల్ ఈ మే నెలలో ప్రకటించింది. చేతిలో ఉండే డివైస్ మాత్రమే కాదు, ఐపాడ్ ప్రొడక్ట్ లైన్‌కే స్వస్తి పలికింది. టెక్ పరిశ్రమను తీవ్రంగా ప్రభావపరిచిన ఒక పాపులర్ ప్రొడక్ట్ కథ అలా ముగిసింది.
మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్: మార్కెట్లోకి వచ్చిన ఇరవై అయిదేళ్ళ తరవాత అధికారికంగానే ఈ జూన్‌లో రిటైర్ కావడమే కాదు, సపోర్ట్‌నూ కోల్పోయింది. కొత్తగా వస్తున్న ఇంప్రూవ్‌మెంట్స్‌తో చూస్తే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పోటీపడలేకపోయింది. దీంతో ఎక్స్‌ప్లోరర్‌కి మూతపెట్టి, కొత్తగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను తీసుకొచ్చామని కంపెనీ పేర్కొంది.
యాపిల్ ఐక్లౌడ్ డాక్యుమెంట్స్ అండ్ డేటా సర్వీస్: 2014లో ఇది ఆరంభమైంది. వేర్వేరు యాప్‌ల నుంచి వచ్చే డేటాను సింక్ చేసి అన్ని డివైస్‌ల్లోకి అందు బాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏప్రిల్‌లో దీన్ని ఆపేశారు. ఇప్పుడు ఇది ఐక్లౌడ్ డ్రైవ్‌లో భాగమైంది.
యూట్యూబ్ గోయాప్: దీన్ని ఈ ఆగస్టులో నిలిపివేశారు. ఇదో లైట్‌వెయిట్ ఆండ్రాయిడ్ యాప్ కాగా 2016లో ఆరంభించారు. ఆఫ్‌లైన్ వీక్షణ, దగ్గర్లో వాటికి షేరింగ్ ఉపయోగపడింది. మొదట ఇండియాలో ఆరంభించి 130 దేశాలకు విస్తరించారు.
గూగుల్ స్టేడియా: ఇది గూగుల్‌కు చెందిన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ స్టేడియా. ఇప్పటికి అందుబాటులో ఉంది. అయితే వచ్చే 2023 జనవరి 18నుంచి ఆగిపోతుంది.
గూగుల్ హ్యాంగవుట్: ఇది టెక్స్ట్, వీడియో, వాయిస్ చాట్ యాప్. ఈ ఏడాది నవంబరు 1 నుంచి అందు బాటులో లేదు. దీని యూజర్లను చాట్‌కు 2021 నుంచి గూగుల్ మళ్ళిస్తోంది. మొత్తానికి స్లో డెత్‌కు గురైంది.
అమోజాన్ ఫుడ్ ఇండియా: మన దేశంలో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను మూస్తున్నట్టు ఈ ఏడాదే అమెజాన్ ప్రకటించింది. రెండేళ్ళ క్రితం బెంగుళూరులో ఆరంభమై నప్పటికీ పెద్ద ఎత్తున ప్రమోషన్ మాత్రం జరగలేదు.
ఫేస్బుక్ గేమింగ్: ఆరంభించిన రెండేళ్ళే అయింది. ఈ అక్టోబరులో దీన్ని క్లోజ్ చేశారు. ఈ యాప్ కూడా రెండు ప్లే స్టోర్‌ల్లోనూ లేదు.
మెటా పోర్టల్ స్మార్ట్ డిస్ప్లేస్: సంబంధిత డెవలప్మెంట్ పనులు అన్నింటినీ మెటా ఆపేసింది. స్మార్ట్ వాచ్ ప్రాజెక్టులోకి వెళ్ళింది. వాస్తవానికి జూన్‌లో దీన్ని అమ్మేసేందుకు మెటా యత్నించినప్పటికీ కుదరలేదని సమాచారం
ఫేస్బుక్ లైవ్ షాపింగ్: ఈ అక్టోబర్ 1 నుంచి ఇది మూతపడింది. దానికి బదులు రీల్స్‌పై దృష్టి సారించింది.
ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీ: తన యాప్ ఐజీటీవీకి సపోర్ట్‌ను ఇన్స్టాగ్రామ్ నిలిపేసింది. వీడియోల సృష్టిని మరింత సులువు చేసే యత్నంలో భాగంగానే దీన్ని నిలిపివేసినట్టు కంపెనీ వెల్లడించింది.
ఇన్స్టాగ్రామ్ హైపర్‌ల్యాప్స్ అండ్ బూమరాంగ్ యాప్స్: ఈ రెంటినీ యాప్ స్టోర్ల నుంచి ఇన్స్టాగ్రామ్ తొలగించింది. టైమ్‌ల్యాప్స్ యాప్ హైపర్ ల్యాప్స్ ని 2014లో, లూపింగ్ వీడియో యాప్ బూమరాంగ్ని 2015లలో ఈ రెంటిని వరుసగా ఆరంభించారు.
బ్లాక్‌బెర్రీ ఔస్ డివైసెస్: దశాబ్దంగా క్రమక్రమంగా తగ్గుతున్న వీటికి జరిగిన ముగింపు పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమే కాదు.
గూగుల్ కరెంట్స్: రెండేళ్ళ క్రితం ఆరం భించిన దీన్ని మూసే శారు. గూగుల్ ప్లస్ పర్ జీ సూట్ కోసం ఈ పని చేశా రు. చాట్, స్పేసెస్ కోసం ప్రముఖంగా జీమెయిల్లో ఇంటిగ్రేట్ చేసే పనిలో ఉన్నారు.
ఆండ్రాయిడ్ ఆటో ఫర్ ఫోన్ స్ర్కీన్: దీనికి స్వస్తి చెబుతున్న గూగుల్ ‘గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్’ వైపు వెళుతోంది. దీని సపోర్ట్‌తో పని చేసే వాహనాల్లో నుంచి తీసేయడం లేదు. ఆండ్రా యిడ్ ఆటో మొబైల్ యాప్‌ని ఫోన్లో ఉపయో గిస్తున్న వారికి మాత్రం గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12 నుంచి ఇది బిల్ట్ ఇన్ అవుతుంది.
ఎక్స్‌బాక్స్ సర్వీసెస్ ఆన్ విండోస్ ఫోన్: ఈ గేమ్‌ను విండోస్ ఫోన్లో ఆడుతున్న వారికి మే నెలలో శుభం కార్డు పడింది.
అమెజాన్ బుక్స్: తమ బ్రిక్ అండ్ మోర్టార్ రీటైల్ స్టోర్స్, పాపప్ షాప్స్‌లో చాలావరకు మూసేయాలని అమెజాన్ నిర్ణయిం చింది. అందుకు బదులు గ్రాసరీ, డిపార్ట్మెంట్ స్టోర్స్‌పై దృష్టి కేంద్రీకరించనుంది.
ఇంటెల్ ఆప్టేన్ మెమరీ: తమ ఆప్టేన్ ఉత్పత్తులకు సంబంధించి డెవలప్మెంట్ కార్యకలాపాలను ఇంటెల్ ఆపేసింది. ప్రస్తుతం ఉన్న ప్రొడక్ట్‌లను మాత్రం ఎప్పటి మాదిరిగా అయిదేళ్ళ వారెంటీతో అమ్ముతామని, అవసరమైన సర్వీసింగ్ కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది.
అమెజాన్ క్లౌడ్ కామ్: అయిదేళ్ళుగా ఉనికిలో ఉన్న దీనికి స్వస్తి పలికింది. కొత్తగా తీసుకున్న రింగ్, బ్లింక్పై దృష్టి సారించింది.
గూగుల్ డూప్లెక్స్ ఆన్ ద వెబ్: ఎఐ ని ఉపయోగిం చుకునే పనిచేసే వెబ్ ఆధారిత ప్రొడక్ట్ ఇది. మూవీ టికెట్స్ కొను గోలుకు ఈ టెక్నాలజీని ఉపయోగి స్తున్నారు. అయితే ఇది అంతగా విజయవంతం కాలేదని సమాచారం.
Updated Date - 2022-12-31T04:09:17+05:30 IST