ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snakes Come in Your House : ఇంట్లోకి పాములు రావడానికి 6 కారణాలు ఇవే..

ABN, First Publish Date - 2022-10-13T21:04:36+05:30

పాముల్ని మన దేశంలో ఎంతగా దేవతలుగా కొలుస్తామో.. అవంటే అంతగా భయపడతాం కూడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాముల్ని మన దేశంలో ఎంతగా దేవతలుగా కొలుస్తామో.. అవంటే అంతగా భయపడతాం కూడా. వాటిని దూరం నుంచి చూసి కూడా ఒళ్ళు జలదరిస్తుంది.  మరి అలాంటి పాములు మన ఇళ్ళల్లోకి వచ్చేసాయంటే.. ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని పరుగులు తీస్తాం. అసలు ఈ విషజంతువులు ఇళ్ళల్లోకి ఎందుకు వస్తున్నాయి. నిపుణులు చెప్పే కారణాలు ఇవే..


1. చర్మాన్ని వదలడానికి ప్రయత్నిస్తాయి.

ఇతర జంతువుల్లాగే పాములకు ఆహారం, నీరు, ఆశ్రయం అవసరం. కానీ పాములు క్రమంగా వాటి చర్మాన్ని విడుస్తాయి. ఇది వాటికి హాని కలిగించే సమయం అడవులు దాటి జన సమూహాల్లోకి వచ్చే పాములకు రాళ్ళు, కాంక్రీటు, కలప ఇలా చాలా వాటికి అనుకుని పాత చర్మాన్ని తొలిగించుకుంటాయి. వీటిని వెతుకుతూనే ఇళ్ళ వైపు వస్తాయి.


2. ఆహారం కోసం వెతుకుతాయి.

రెండోది వాటికి ఆహారం దొరకకపోవడం కూడా సమస్యే. పాములు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. వీటి వేట అలవాట్లకు తగ్గట్టుగా పంట పొలాల్లో తెగుళ్ళ నుంచి బయటపడేలా సహాయపడతాయి. కానీ కొన్ని సందర్భాలలో సరీసృపాలు ఆహారం కోసం ఇళ్ళవైపు వస్తాయి. ఇవి ఇళ్ళల్లో ఉండే ఎలుకల్ని పట్టుకోడానికి వస్తాయి. కప్పలు, బల్లులు, పక్షులు ఇలా చాలా వాటిని ఇళ్ళ పరిసరాల్లో వెతుకుతాయి.


3. వెచ్చదనం కోసం..

పాములు చల్లని బ్లడెడ్ జీవులు వెచ్చగా, చురుకుగా ఉండడానికి చూస్తాయి. పాములు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేవు. అవి చల్లగా ఉన్నప్పుడు వెచ్చని ప్రదేశం కోసం వెతుకుతాయి. 


4. ఇంట్లోకి వచ్చే మార్గాలను వెతుకుతాయి.

తలుపులు, కిటికీలు, బీటలు వారిన గోడల గుండా ఇళ్ళల్లోకి ప్రవేశిస్తాయి. చిన్న చిన్న కన్నాల గుండా చేరతాయి. ఆరుబయట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాములు ప్రవేశిస్తాయి.


5. ఎర పక్షులు, జంతువులు..

పాములు ఇంటి ప్రదేశాలను దాచిపెట్టే ప్రదేశాలుగా ఎవరూ గుర్తించలేరు అన్నట్టుగా భావిస్తాయి. చిన్న సందు దొరికినా వచ్చి మూలల్లో చేరతాయి. బుతువులు మారినప్పుడు పాములు నిద్రాణ స్థితిలోకి చేరతాయి.


6. కాలం మారినా కూడా...

వర్షాకాలంలో మాత్రం కాస్త నిర్మానుష్యంగా విసిరేసినట్టు ఉండే ఇళ్ళ ప్రాంతాలలో, ఇరుకుగా ఉండే గుడెసెలు వంటి వాటిల్లో పాములు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కనుక అప్రమత్తంగా ఉండాలి. పాములు చేరకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలి.

Updated Date - 2022-10-13T21:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising