ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదొక్కటే వంద పాటలతో సమానం

ABN, First Publish Date - 2022-03-06T05:43:44+05:30

మాది హన్మకొండ. నేను పుట్టిన ఐదు నెలలకే అమ్మా, నాన్నలు అమెరికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘‘గురి పెట్టేది ఎవరో
  • ఎర చిక్కేది ఎవరో
  • వేటకు చావు చిట్ట చివరో..’’
  • - ‘భీమ్లా నాయక్‌’ సినిమా ఈ పాటతోనే మొదలవుతుంది. ఒక్క పాటలో సినిమా కథ మొత్తం ఆవిష్కరించేశారు తమన్‌. ఆ  భావం, స్వరంతో పాటు.. ఆ గళం కూడా - మనసుకి తాకుతుంది. ఆ గొంతు మనీషాది. అమెరికాలో పుట్టి పెరిగిన అచ్చతెనుగు అమ్మాయి.. మనీషా. చదువంతా పూర్తయ్యాక సంగీతంపై ప్రేమతో ఇండియాకొచ్చి, తెలుగు పాటలు పాడుతూ, సంగీత ప్రపంచంలో ప్రయాణం చేస్తోంది. ‘భీమ్లా నాయక్‌’ పాటతో మనీషాకి చక్కటి గుర్తింపు లభించిన సందర్భంగా ఈ కొత్త టాలెంట్‌ని ‘నవ్వ’ పలకరించింది.

‘‘మాది హన్మకొండ. నేను పుట్టిన ఐదు నెలలకే అమ్మా, నాన్నలు అమెరికా షిఫ్ట్‌ అయిపోయారు. నా బాల్యం, స్కూలింగ్‌ అంతా క్యాలిఫోర్నియాలోనే గడిచింది. ఎంత అమెరికాలో సెటిల్‌ అయినా, పుట్టిన ఊరుని, భాషని మర్చిపోలేం కదా? మా ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు. అమ్మానాన్నలకు సంగీతం, నాట్యం అంటే ఆసక్తి. వాళ్ల కోసం నేను కర్నాటిక్‌ సంగీతంతో పాటుగా భరతనాట్యం నేర్చుకొన్నా. నిజానికి చిన్నప్పుడు నేనేం సీరియస్‌గా తీసుకోలేదు. కేవలం ఓ హాబీగా మాత్రమే అనుకొనేదాన్ని. కానీ రాను రాను.. పాటలపై ప్రేమ పెరిగింది. ‘పాడుతా తీయగా’ యూఎస్‌ సిరీస్‌ ఆడిషన్స్‌ జరిగినప్పుడు ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్‌ అయ్యా. ఆ సీజన్‌లో నా పయ్రాణం ఫైనల్‌ వరకూ సాగింది. నిజానికి అప్పటి వరకూ నేను క్లాసికల్సే పాడేదాన్ని. సినిమా పాటలు ఎలా పాడాలో కూడా నాకు తెలీదు. అవన్నీ ‘పాడుతా తీయగా’ టైమ్‌లోనే నేర్చుకొన్నా.  


అప్పుడొచ్చింది ఆలోచన

చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయాత్నాలు మొదలెట్టినప్పుడు ఓ ఆలోచన వచ్చింది. ‘సినిమా పాటల కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది’ అనిపించింది. రిస్క్‌ తీసుకునే వయసు కూడా ఇదే. ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు. ఆ తరవాత.. ‘అరె.. మనమెందుకు ప్రయత్నించలేదు’ అనే గిల్టీ ఫీలింగ్‌ ఉండకూడదు. అందుకే ఇటువైపు అడుగులు వేశా. కొంతకాలం ఇండియాలో ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిద్దామన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చా. నిజానికి ఇది నా జీవితంలో నేను తీసుకున్న క్లిష్టమైన నిర్ణయం. ఈ విషయంలో నా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం మర్చిపోలేను.


చిన్న పాత్ర

‘ఫిదా’లో ఓ చిన్న పాత్ర చేశాను. అది కూడా శేఖర్‌ కమ్ముల గారిపై ఉన్న గౌరవంతోనే. నటన అంటే ఏమిటి? ఓ చిన్న సీన్‌ కోసం ఎవరెంత  కష్టపడతారు? సెట్లో ఏమేం జరుగుతుంటాయి? అనేది తెలుసుకోవడానికి ‘ఫిదా’ నాకు చాలా బాగా ఉపయోగపడింది. నిజంగా అది ఓ అద్భుతమైన అనుభవం. ‘ఫిదా’ తరవాత చాలామంది నన్ను ‘నటిస్తారా’ అని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఓ చిన్న సీన్‌, చిన్న పాత్ర కోసం కూడా రోజుల తరబడి కేటాయించాల్సివస్తుంది. ఆ సమయం సంగీతానికి, పాటలకూ కేటాయిస్తే బాగుంటుందిపించింది. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. 


తేడా తెలిసింది

కార్తీక్‌ అనే కంపోజర్‌ ట్యూన్‌ చేసిన పాటతో నా ప్రయాణం మొదలైంది. లైవ్‌లో పాట పాడడానికీ, రికార్డింగ్‌ థియేటర్లో పాట పాడడానికి ఉన్న స్పష్టమైన తేడా ఆ రోజే తెలిసింది. ఆ క్షణాలు చాలా ఇబ్బందిగా సాగాయు. రికార్డింగ్‌ థియేటర్లో చాలా టెక్నిక్స్‌ ఉంటాయి. అవేం నాకు అర్థం కాలేదు. కానీ కార్తిక్‌ చాలా ఓపిగ్గా నాతో పాట పాడించారు.


పెద్ద గౌరవం

‘భీమ్లా...’లో పాడడం చాలా పెద్ద గౌరవం. తమన్‌ సార్‌కి చాలా ఏళ్లుగా కోరస్‌, ట్రాక్‌... ఇలా పాడుతూనే ఉన్నా. ‘మహానుభావుడు’లో ‘కిస్‌ మీ బేబీ’ పాడాను. ‘డిస్కోరాజా’లో ‘డాన్‌ బాస్కో’, ‘ఇంటిలిజెంట్‌’లో ‘నా సెల్‌ఫోన్‌’, ‘చల్‌ మోహన్‌ రంగ’ ‘మాయామి’ పాటలు నేనే పాడా. ‘భీమ్లా’లో పాట పాడడం నిజంగా ఓ పెద్ద పండగలా అనిపించింది. ఈ పాట ట్రాక్‌ నేనే పాడా. పాట నాతో పాడిస్తారా? మరొకరితోనా? అని డౌట్‌ ఉండేది. ఫోక్‌ లాంటి పాట ఇది. ఈ తరహా పాటని ఇది వరకు పాడలేదు. తమన్‌ సార్‌ నాపై నమ్మకంతో ఈ పాట అప్పగించారు. ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. వంద పాటలకు సరిపడా అనుభవాన్ని, గుర్తింపునీ సంపాదించింది. ‘భీమ్లా..’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అయిపోయాక నేను యూ.ఎస్‌. వచ్చేశా. ఎయిర్‌ పోర్ట్‌లో దిగి, నేరుగా థియేటర్‌కి వెళ్లి ‘భీమ్లా నాయక్‌’ చూశా. నాతో పాటు నా కుటుంబ సభ్యులూ ఉన్నారు. నా పాట తెరపై ప్లే అవుతుంటే... అమ్మానాన్నల కళ్లలో ఆనందం కనిపించింది. చాలా గర్వంగా ఫీల్‌ అయ్యా.


కోరస్‌ పాడతా

నేను ఇప్పటికీ కోరస్‌ పాడతా, ట్రాకులు పాడతా. ‘నేను సింగర్‌ని, పాటలే పాడతా’ అని చెప్పడానికి ఏం లేదు. నిజానికి కోరస్‌ పాడినా, ట్రాకులు పాడినా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మిగిలిన సింగర్స్‌తో ఎలా కో - ఆర్డినేట్‌ చేసుకోవాలో కోరస్‌ పాడితే తెలుస్తుంది. పాట తొందరగా నేర్చుకుని పాడడానికి ట్రాకులు ఉపయోగపడతాయి. తన పాటకు ఎవరి గొంతు సూటవుతుందో నిర్ణయించుకునే హక్కు కంపోజర్‌కి ఉంటుంది. ఈ విషయంలో కంపోజర్స్‌ నిర్ణయాన్ని తప్పుపట్టలేం. నా పాటలు వేరే వాళ్లు పాడారు. వేరే వాళ్ల పాటలు నేను పాడాను. సినిమా పాటల విషయంలో ఇది మామూలే. మన పాట చేజారినప్పుడు కొంత బాధ ఉంటుంది. దాన్ని దాటుకుని రావడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సిందే. పాట పాడే ముందు చాలా రిహార్సల్స్‌ చేస్తా. కొన్నిసార్లు ప్రిపేర్‌ అవ్వడానికి అంత టైమ్‌ ఉండకపోవచ్చు. పాటలో కొత్త పదాలు ఉంటే వాటి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. నా గొంతు చాలా సున్నితం. అందుకే చల్లని పానియాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నా.


నేను ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశా. చాలా కష్టమైన సబ్జెక్ట్‌ అది. కానీ.. చాలా ఓపిగ్గా, ఇష్టంగా చదివా. చదువు విషయంలో చాలా సిన్సియర్‌.


నా పాటల కోసం యూ ట్యూబ్‌ ఛానల్‌ మొదలు పెట్టా. కొన్ని పాటల్ని కంపోజ్‌ చేసి, నేనే పాడి.. అప్‌లోడ్‌ చేస్తున్నా. ‘నాలో తపన’ అనే ఓ పాటని కంపోజ్‌ చేశా. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. నేను సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటా. ‘మీ పాట ఇప్పుడే విన్నాను.. బాగుంది’ అని ఎవరైనా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే కొన్ని నెగిటీవ్‌ కామెంట్స్‌ కూడా వస్తుంటాయి. వాటిని నేనెప్పుడూ మైండ్‌లోకి తీసుకోను.


Updated Date - 2022-03-06T05:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising