Srilila : శ్రీలీలకు భలే ఛాన్స్!
ABN, First Publish Date - 2022-11-27T02:22:09+05:30
’పెళ్లి సందడి’తో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది శ్రీలీల. వెంట వెంటనే రవితేజ, నితిన్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొంది.
’పెళ్లి సందడి’తో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది శ్రీలీల. వెంట వెంటనే రవితేజ, నితిన్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొంది. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకొంది. మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా పూజా హెగ్డేని ఇది వరకే ఎంచుకొన్నారు. మరో కథానాయిక పాత్ర శ్రీలీలకు దక్కింది. డిసెంబరులో చిత్రీకరణ మొదలు కానుంది. మహేశ్‌తో పాటుగా శ్రీలీల, పూజా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. ఇందులో ఓ ప్రత్యేక గీతం కూడా ఉండబోతోందని టాక్. ఆ పాట కోసం ఓ ప్రముఖ కథానాయిక పేరు పరిశీలనలో ఉంది. ఇది వరకే ఈ సినిమా కోసం ఓ ఫైట్ సీక్వెన్స్‌ని కూడా రూపొందించారు. ఆ తరవాత.. కథ విషయంలో మార్పులూ, చేర్పులూ చోటు చేసుకొన్నాయి. ఇది వరకు రాసిన కథని పూర్తిగా పక్కన పెట్టి, మహేశ్ కోసం త్రివిక్రమ్ కొత్త కథ అల్లారని సమాచారం. అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం అలస్యమైంది. ఇప్పుడు కథ విషయంలో క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరపాలని నిర్ణయించారు.
Updated Date - 2022-11-27T02:22:10+05:30 IST