ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ధైర్యమే నడిపిస్తోంది...

ABN, First Publish Date - 2022-10-17T10:49:46+05:30

ప్రేమించి, పెళ్ళాడిన భర్త మరణం... ఆర్థిక సమస్యలు... కుటుంబ బాధ్యతలు... అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు నోమితా సరూ. దేవతా ఉత్సవ విగ్రహాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమించి, పెళ్ళాడిన భర్త మరణం... ఆర్థిక సమస్యలు... కుటుంబ బాధ్యతలు... అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు నోమితా సరూ. దేవతా ఉత్సవ విగ్రహాల తయారీకి ప్రసిద్ధమైన ప్రాంతంలో... ఆ వృత్తిలో ఏకైక మహిళగా రాణిస్తున్నారు. తోటి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. 



‘‘మా ప్రాంతంలో దేవతల ఉత్సవ విగ్రహాలను తయారు చెయ్యడాన్ని పవిత్రమైన కార్యంగా పరిగణిస్తారు. వాటిలో స్త్రీశక్తికి ప్రతిరూపాలైన దేవీ విగ్రహాలే ఎక్కువ. కానీ రంగులు వెయ్యడం మినహా... మిగిలిన ఏ దశలోనూ మహిళలను అనుమతించరు. మాది కళాకారుల కుటుంబం. మా నాన్న విగ్రహాలు చేసేవారు. ఆయన పక్కనే కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. నా ఆసక్తిని గమనించి... బొమ్మల తయారీలో మెళకువల్ని ఆయన నాకు నేర్పించారు. సరదా కోసం నేర్చుకున్న ఆ విద్యే... నాకు జీవనోపాధి అవుతుందని అనుకోలేదు. 


మాది పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లాకు చెందిన ప్రశస్థ అనే చిన్న గ్రామం. ఎనిమిది తోబుట్టువుల్లో నేను నాలుగోదాన్ని. విగ్రహాలు, బొమ్మల తయారీ ద్వారా మా నాన్న సంపాదించే అరకొర ఆదాయంతో... పదిమందికి పైగా ఉన్న కుటుంబం ఎంత కష్టంగా గడిచేదో ఊహించుకోవచ్చు. అయినా మమ్మల్ని బాగా చదివించాలని మా అమ్మా, నాన్నా ఎంతో తాపత్రయపడేవారు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు... మా ఇంటికి దగ్గరగా ఉండే అబ్బాయిని ప్రేమించాను. అతను నా కన్నా పన్నెండేళ్ళు పెద్ద. నాకు పదహారేళ్ళ వయసులో... 2000లో పెళ్ళయింది. దాంతో నా చదువు ఆగిపోయింది. మా ఊరికి కొన్ని మైళ్ళ దూరంలో నా భర్త ఒక ఫుడ్‌ జాయింట్‌ నడిపేవారు. ఆ ఆదాయం మాకు సరిపోయేది. మాకో అబ్బాయి పుట్టేడు. జీవితం సంతోషంగా గడిచిపోయేది. కానీ ఆ అదృష్టం ఎంతోకాలం నిలవలేదు.


సమస్యలన్నీ ఒకేసారి...

ఒక రోజు నా భర్త హఠాత్తుగా అనారోగ్యం పాలుకావడంతో పరీక్షలు చేయించాం. ఆయనకు గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తేలింది. మంచి చికిత్స కోసం మా దగ్గరున్న డబ్బుతో పాటు అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. నా భర్త మంచం పట్టడంతో... ఆయన నడిపే దుకాణం మూతపడింది. ఇలా సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. నా భర్త కోలుకుంటారన్న నా ధీమా ఎంతోకాలం నిలవలేదు. 2006లో ఆయన మరణించారు. మా అబ్బాయి చిన్నవాడు. వాడిని పెంచి, ఒక దారి చూపించాల్సిన బాధ్యత నా మీద పడింది. చిన్న చిన్న పనులు ఎన్నో చేశాను. కానీ ఆదాయం పెద్దగా వచ్చేది కాదు. నిరాశగా అనిపించేది. ఒక రోజు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు... నాన్న దగ్గర నేర్చుకున్న విగ్రహాల తయారీని ఉపాధి మార్గంగా ఎందుకు చేసుకోకూడదనిపించింది. మొదట చిన్న చిన్న బొమ్మలు చేశాను. వాటి అమ్మకాలు బాగుండడంతో... పెద్ద విగ్రహాల రూపకల్పన మొదలుపెట్టాను. పెట్టుబడి కోసం ఇబ్బందులు ఎదురైనా... విగ్రహాలు చక్కగా తయారవడంతో... తక్కువ కాలంలోనే వ్యాపారం పెరిగింది. ఆరు నెలల్లోనే మరికొందరిని పనిలో పెట్టుకున్నాను. 




రాజీ పడలేదు...

మా ఊరు ప్రశస్థ... దేవతా విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఒక్క మా గ్రామంలోనే మూడు వందల మంది తయారీదార్లున్నారు. వారందరిలో మహిళను నేనొక్కదాన్నే. అయితే ఎలాంటి వివక్షనూ నేను ఎదుర్కోలేదు. నా తోటి కళాకారులు నాకు మొదటి నుంచీ మద్దతుగా నిలిచారు. అయితే మొదట్లో విక్రయాల విషయంలో కష్టపడ్డాను. కరోనా కారణంగా రెండేళ్ళపాటు వ్యాపారం దెబ్బతింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే మట్టి, వెదురు, గడ్డి, ఇతర వస్తువుల ఖరీదు కూడా పెరిగిపోవడంతో లాభాలు బాగా తగ్గిపోయాయి. అయినా నాణ్యతలో రాజీ పడలేదు.


తొమ్మిది నుంచి పన్నెండు అడుగుల విగ్రహం వరకూ నేను ఒక్కదాన్నే తయారు చెయ్యగలను. విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండడంతో ఈ ఏడాది ఆర్డర్లు, విక్రయాలు పెరిగాయి. మా అబ్బాయి కూడా నాకు సాయం చేస్తున్నాడు. నా భర్త మరణించాక... కొంతకాలం తీవ్రమైన నిరాశలో మునిగిపోయాను. మా జీవితాలు ముగిసిపోతాయనుకున్నాను. కానీ క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాను. అదే ధైర్యం ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. మేము తయారు చేసే విగ్రహాలకు ప్రజలు చేసే పూజల ఫలితంలో మాకూ భాగం ఉంటుందని నమ్ముతాను. నా చుట్టూ నిస్సహాయులైన ఎందరో మహిళలున్నారు. వారిలో కొందరికి విగ్రహాల తయారీ నేర్పిస్తున్నాను. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడే ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాను.’’

Updated Date - 2022-10-17T10:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising