ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌తో స్కానింగ్‌ ఇలా

ABN, First Publish Date - 2022-08-20T05:57:52+05:30

డాక్యుమెంట్స్‌ స్కానింగ్‌కు నేడు పలు టూల్స్‌, యాప్స్‌ ఉన్నాయి. నిజానికి ఆండ్రాయిడ్‌ డివైస్‌లోనే ఆ పని కానివ్వవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్యుమెంట్స్‌ స్కానింగ్‌కు నేడు పలు టూల్స్‌, యాప్స్‌ ఉన్నాయి. నిజానికి ఆండ్రాయిడ్‌ డివైస్‌లోనే ఆ పని కానివ్వవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌కు కుడివైపు సంబంధిత టూల్‌ ముందస్తుగా ఇన్‌స్టాల్‌ అయి ఉంది. గూగుల్‌ డ్రైవ్‌ యాప్స్‌ అటు ఆండ్రాయిడ్‌ ఇటు ఐఓఎస్‌లో సుమారుగా ఒకేలా ఉంటాయి. 


అయితే ఆండ్రాయిడ్‌ డివైస్‌ల్లోనే స్కానింగ్‌ ఫీచర్‌ యాక్సెస్‌లో ఉంటుంది. గూగుల్‌ డ్రైవ్‌ హోమ్‌ పేజీ నుంచి స్కానింగ్‌ టూల్‌ని పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కాన్‌ చేసిన తరవాత సదరు డాక్యుమెంట్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్‌ డ్రైవ్‌ ప్రాథమికంగా క్లౌడ్‌ స్టోరేజ్‌ టూల్‌ కావడమే అందుకు కారణం. ఇక కావాల్సిందేమిటంటే...


  • ఆండ్రాయిడ్‌ డివైస్‌లో గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌ స్ర్కీన్‌ కుడివైపు అడుగున ఉండే ప్లస్‌ ఐకాన్‌ని టాప్‌ చేయాలి.
  • స్కాన్‌ బటన్‌ని హిట్‌ చేయాలి.
  • కెమెరా యాక్సెస్‌ కోసం అనుమతించాలి.
  • పిక్చర్‌ తీసుకోనున్నందున డాక్యుమెంట్‌పై ఉన్న చెక్‌మార్క్‌ని టాప్‌ చేయాలి.
  • క్రాపింగ్‌ టూల్‌ని టాప్‌ చేసి, డాక్యుమెంట్‌ నలుమూలలకు తిప్పాలి. తద్వారా డాక్యుమెంట్‌లో కావాల్సిన ఏరియా యావత్తు స్కాన్‌ అయ్యేలా చూసుకోవాలి.
  • సేవ్‌ బటన్‌ టాప్‌ చేయాలి.
  • ఫైల్‌ నేమ్‌, గూగుల్‌ అకౌంట్‌, లొకేషన్‌ని సెలెక్ట్‌ చేసిన తరవాత సేవ్‌ బటన్‌ని మరోసారి హిట్‌ చేయాలి. 
  • స్కాన్‌ అయిన డాక్యుమెంట్‌ ఆటోమేటిక్‌గా పీడీఎఫ్‌ రూపంలోకి కన్వర్ట్‌ అవుతుంది. 

Updated Date - 2022-08-20T05:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising