ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ లాలీ.. మేఘ శ్యామ లాలీ

ABN, First Publish Date - 2022-04-08T05:30:00+05:30

‘కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు తొంబదియైుదు వాళ్ళు అన్నది నిజము’ అంటారు కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీమద్రామాయణం మహోన్నతమైన ఇతిహాసం. అందులోని అన్ని కాండలు అపూర్వాలు. వాటిలో బాల కాండ అత్యద్భుతం. ముఖ్యంగా... శ్రీరామ జనన ఘట్టం సాటిలేనిది. శ్రీరామ జనన వృత్తాంతాన్ని చదివినా, విన్నా ఉత్తములైన సంతానం కలుగుతుందనే నమ్మకం ఆసేతుహిమాచలం ఉంది. తెలుగునాట తల్లులు శ్రీరాముని పేరుతో ఎన్నో వేడుకలు జరుపుకొంటారు. ఉయ్యాల ఉత్సవంలో ‘రామ లాలీ... మేఘ శ్యామ లాలీ’ అని పాడుతూ పరవశం చెందుతారు.


‘కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు తొంబదియైుదు వాళ్ళు అన్నది నిజము’ అంటారు కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’లో శ్రీరామ జనన గాథను తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో మనోహరంగా చిత్రించారు. పుత్రకామేష్ఠి యాగంలో... యజ్ఞపురుషుడు అందించిన పాయసాన్ని దశరథుడు తన రాణులైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచి ఇచ్చాడు. ఆ ముగ్గురూ గర్భవతులయ్యారు. వారికి నెలలు నిండి, ప్రసవ సమయం ఆసన్నమయింది. అది స్వభాను నామ సంవత్సరం. చైత్ర మాసం వచ్చి ఎనిమిది రోజులు గడిచాయి. ఈ సందర్భంలో విశ్వనాథవారి కవితా హృదయం ఇలా పల్లవించింది...

పూర్వమిన్ని యుషఃకాలములను నేటి నవమి యే పుణ్య కాలమో?

తవిలి యీ స్వభానువే నోము నోచెనో?

యైున చైత్రశుక్ల పక్షంబు లెంతటి శోభగలవొ!

షోడశ కళాపూర్ణుడైన శ్రీరామ జననానికి స్వాగతమిస్తున్నట్టు... పూల జల్లు మాదిరిగా వాన జల్లు కురిసింది. గ్రహమండలం సమస్తం తమ తమ స్థానాల్లో కదలకుండా నిలుచుంది. శ్రీరాముడు ఉదయించే వేళ కోసం కాచుకొని ఉన్నాయి. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు.

ఒకవైపు దశరథ తనయ శాంతి వచ్చి, కౌసల్యతో... ‘‘అమ్మా! నారాయణుడు నరుడిగా నీ కడుపున పుడతాడట! మా వారు (ఋష్యశృంగుడు) తన శిష్యగణాలతో కలిసి... దేవదేవుని చూడడానికి వస్తున్నారు. నేను ముందుగా వచ్చాను’’ అన్నది. కౌసల్య చిరునవ్వు నవ్వింది. మరోవైపు దాసదాసీ జనం ప్రసవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


శ్రీమన్మాలా భారతిగా మొదలగు యోగ శతముగా గ్రహరాజుల్‌ స్వామి జననంబు వేళకు 

సోమించిరి దితిజహరణ సూచకములుగాన్‌ - అంటారు విశ్వనాథవారు. 


కోటలో మధ్యాహ్న ఘంటారావం ప్రతిధ్వనించింది. అటు ఘంటారావం... ఇటు శీర్షోదయం. నవమి తిథిలో... కర్కాటక లగ్నంలో... ఆ నారాయణుడు నరుడిగా ప్రభవించాడు. తల్లి తన ప్రసూతి నొప్పులను మరచి, ఆనందంతో బిడ్డను అందుకోబోయింది. మంత్రసాని వారించింది. బిడ్డను తట్టి గిల్లింది. ఈ ఘట్టాన్ని...


కెవ్వున స్విగ్ధమంథరము కేక వినంబడె మంత్రసానియున్‌

బువ్వును బోలె జే శిశువు బూనెను పట్టపురాణియున్‌ గనుల్‌

నొవ్వగు మూతవిచ్చుచు గనుంగొనె భాగ్యము నామె కన్నులన్‌

నవ్వెనొ జాలిపొందెనొ సనాతనమౌ మధుకాంతి జిమ్మెనో!... అంటూ వర్ణించారు విశ్వనాథ.


కౌసల్యా నందనుణ్ణి చూసి మంత్రసానులు పులకించారు. మహారాజుకు కబురు పంపారు. దశరథుడు ఆత్రుతగా వచ్చాడు. వంశోద్ధారకుణ్ణి చూసి మురిసిపోయాడు. మెల్లగా రాణివంక చూశాడు. ప్రసవ నొప్పులను ఓర్చుకుంటూ, తన బిడ్డ జననం ద్వారా అలౌకికానందాన్ని పొందుతున్న కౌసల్య అరమోడ్పు కన్నులతో భర్తను వీక్షించింది. 


శిశు జననం తరువాత బొడ్డు కోసే ప్రక్రియను కూడా విశ్వనాథ వివరించారు.

కోసిన బొడ్డుపై నదిమి గోర విభూతిని బోరుకాడ గం

గాసరిదంబుపాదయుగు గంధిసుతాహృదయేశు స్వామినిం

జేసిరి బోరుకాడగను జేసిరి క్షీరసముద్రశాయి ము

క్తీశుడు ముక్తిగబ్బు విడియింపగ రా నిను వింపు లొందగన్‌


‘బోరుకాడ’ అంటే స్నానం చేయించడం. నారాయణుడు నరుడిగా అవతరించాడనే వార్త తెలిసి ముల్లోకాలూ ఆనంద తాండవం చేశాయట. ఇక అయోధ్యా నగరంలో సంబరం సంగతి చెప్పేదేముంది?


ముగ్గురు రాణులు మగ బిడ్డలకు జన్మనిచ్చారు. నామకరణ మహోత్సవాన్ని దశరథుడు ఏర్పాటు చేశాడు.  కుల గురువు వశిష్టుడు పసిడి పళ్ళెంలో బియ్యం ఉంచి... దశరథుడికి ఉంగరం ఇచ్చి ‘శ్రీరాముడు’ అని రాయమన్నాడు. షోడశ కళలతో ప్రభవించిన బిడ్డను చూసి... చంద్రుడిలా ఉన్నాడనుకున్నాడు దశరథుడు. ఆ చంద్రుడే మదిలో మెదలి ‘శ్రీరామచంద్రుడు’ అని రాశాడు. ఈ తంతును చూడడానికి అలస్యంగా వచ్చిన మహామంత్రి సుమంతుడు ఆ పేరును ‘రామభద్రుడు’ అని చదివాడు. తెలుగునాట ఈ రెండు పేర్లూ శాశ్వతమై విరాజిల్లుతున్నాయి. 

 ఆయపిళ్ళ రాజపాప


10న శ్రీరామ నవమి


శ్రీరామావతారం పరిపూర్ణావతారం. జగద్రక్షణ కర్తవ్యంగా... నరుడిగా నారాయణుడు అవతరించాడు. వాల్మీకికి నారదుడు చెప్పిన శ్రీరాముడి గుణాలను దృష్టిలో ఉంచుకొని రామాయణాన్ని పఠించినప్పుడు... ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. కారుణ్యం, కాఠిన్యం, ఓర్మి, దయ, ప్రతాపం, ప్రసన్నతల ద్వారా రక్షా నైపుణ్యాన్నీ, శిక్షా వైఖరినీ ఆయన ప్రదర్శించాడు. ధర్మం, సత్యం ఆలంబనగా రాజ్యపాలన సాగించాడు. కల్యాణ గుణాభిరాముడిగా వినుతికెక్కాడు. లోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ రాముడి జనన ఘట్టం ఆద్యంత మనోహరం. 


Updated Date - 2022-04-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising