ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదెక్కడి జోక్‌ రా మామా...!

ABN, First Publish Date - 2022-02-06T05:30:00+05:30

రాహుల్‌ రామకృష్ణ... తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్న కమిడియన్‌. నిత్యం బిజీగా ఉండే నటుడు. తెరపై కనిపిస్తే నవ్వులే.. నవ్వులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాహుల్‌ రామకృష్ణ... తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్న కమిడియన్‌. నిత్యం బిజీగా ఉండే నటుడు. తెరపై కనిపిస్తే నవ్వులే.. నవ్వులు. తెర బయటా.. అలానే జోక్‌ చేసి, అది కాస్త వికటించి.. నవ్వుల పాలయ్యాడు. ఉన్నట్టుండి ‘2022 తరవాత సినిమాల్లో నటించను. ఎవరేం అనుకున్నా సరే.. ఇదే నా అంతిమ నిర్ణయం’ అంటూ సీరియ్‌సగా ఓ ట్వీట్‌ చేశాడు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. మంచి నటుడు.. క్రేజ్‌ ఉన్నవాడు.. కుర్రాడు.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో? అనుకున్నారు. ‘నీ నిర్ణయం మార్చుకో..’ అంటూ చాలామంది రాహుల్‌ని కోరారు. కొంతమంది మాత్రం ‘ఇదంతా కామెడీ కోసమేనా.. ఏ సినిమా కోసం..’ అంటూ లైట్‌ తీసుకున్నారు. చివరకు అదే నిజమైంది. రాహుల్‌ నిజంగానే జోక్‌ చేశాడట. ‘‘ఇంత మంచి జీవితాన్ని, డబ్బుని, విలాసాలను ఇచ్చిన సినిమాని ఎందుకు వదులుకుంటా.. జస్ట్‌ జోక్‌ చేశా.. ఫూల్స్‌’’ అంటూ ఈ ప్రహసనం ముగించాడు. దాంతో.. నెటిజన్లు ఇప్పుడు మండి పడుతున్నారు. ‘‘మమ్మల్ని బకరాలు చేస్తావా..’’ అంటూ రాహుల్‌ని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది ‘నీ పైత్యం ఎక్కువైంది.. ఇక నీ సినిమాలు చూడం..’’ అంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి రాహుల్‌ మాత్రం ఈ రూపేణా వార్తల్లో నిలిచాడు.

Updated Date - 2022-02-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising