పాపులర్ వీడియోస్
ABN, First Publish Date - 2022-12-31T04:18:52+05:30
యూట్యూబ్‌లో భారతదేశంలో ఈ ఏడాది వీక్షకాదరణ పొందిన వీడియోల జాబితాను గూగుల్ విడుదల చేసింది.
యూట్యూబ్‌లో భారతదేశంలో ఈ ఏడాది వీక్షకాదరణ పొందిన వీడియోల జాబితాను గూగుల్ విడుదల చేసింది. క్రియేటర్లు, ఆర్టిస్టులు తమదైన సృజనాత్మకతను జోడించి వివిధ ఫార్మేట్లలో విడుదల చేస్తున్న కంటెంట్‌తో వీక్షకులు కనెక్ట్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. నాలుగు గంటల ఈ స్పోర్ట్స్ మొదలుకుని కేవలం ఒక్క నిమిషం నిడివి కలిగిన ఆర్ట్‌కు ఆదరణ లభించడం విశేషం. జాబితాలోని పాపులర్ వీడియోల విషయానికి వస్తే....
ఏజ్ ఆఫ్ వాటర్ - రౌండ్2హెల్ (ఆర్2హెచ్: 540 లక్షల వ్యూస్ ఈ వీడియోకు ఉన్నాయి. నీటి పరిరక్షణపై ఆలోచనలను రేకెత్తించే వీడియో ఇది. నీటిని వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలను సందర్శించే జనాలకు సంబంధించిన కథ. నీరు లేక జనాలు ప్రాణాలు కోల్పోతుంటారు.
సామి సామి - పుష్ప: ఇది తెలుగు సినిమా. ఈ పాటకు 4900 లక్షల వ్యూస్ వచ్చాయి.
సస్టా షార్క్ ట్యాంక్ - ఆశిష్ చంచలాని: దీనికి 560 లక్షల వ్యూస్ ఉన్నాయి. సోనీ టీవీలో పాపులర్ రియాల్టీ షో. హాస్యం మిళితమై ఉంటుంది.
ఇండియన్ ఫుడ్ మేజిక్: 330లక్షల వ్యూస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వండుకునే ప్రత్యేకమైన వంటకాలను ఇందులో చూపిస్తారు. గోల్‌గప్పా, స్పెషల్ పాన్ సహా పలు ఐటెమ్స్‌ను ఇందులో చూడవచ్చు.
అరబిక్ కుతు - బీస్ట్ ఫస్ట్ సింగిల్ ప్రమో: 330 లక్షల వ్యూస్ ఉన్నాయి. ప్రేమికుడిని కలగన్నాను అంటూ వచ్చే ఈ పాట - తలపతి విజయ్ ప్రొమో సాంగ్. అరబిక్ కుతు మూలాలపై చర్చ సహా మేకర్ల క్లిప్స్ సహా అన్నీ ఈ ప్రొమో సాంగ్‌లో ఉంటాయి.
దారువిత్ డాడ్ 3 హర్ష్ బేనీవాల్: 250 లక్షల వ్యూస్ ఉన్నాయి. తండ్రి, కొడుకు బంధంపై కామెడీ వీడియో ఇది.
బీబీ కి వైన్స్ - ఆటోమేటిక్ గాడీ: 210 లక్షల వ్యూస్ ఉన్నాయి. కొత్త కారు కొనుగోలు చేసేందుకు బబ్లూ, భువన్ కలిసి ఉదయమే సమీర్ ఇంటికి వస్తారు.
దూధియా - ద మృదుల్: 380 లక్షల వ్యూస్ ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంతో ఈ వీడియోను రూపొందించారు.
బిగ్గెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్: 1460.25 లక్షల వ్యూస్ ఉన్న జీటీఏ వీ పాపుల్ గేమ్ వీడియో
ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ 2022 సెంతోస-ఫైనల్స్: 200 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఏడాదికి రెండుసార్లు గరెనా నిర్వహించే గ్లోబల్ ఫ్రీ ఫైర్ టోర్నమెంట్
చిడియా ఘర్ - అమిత్ బంధన: 190 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇదో షార్ట్ కామిడీ మూవీ వీడియో
శ్రీవల్లి - పుష్ప: 5440 లక్షల వ్యూస్ వచ్చాయి. పుష్ప పేరిట వచ్చిన తెలుగు మూవీ ఇది. 2021 డిసెంబరు 17న ఈ సినిమా విడుదలైంది.
అరబిక్ కుతు - హలామితి హబిబో - లిరిక్ వీడియో: 4930 లక్షల వ్యూస్ ఉన్నాయి. తెలుగులో పాట ఇది. ఈ మూవీ 2022 ఏప్రిల్‌లో విడుదలైంది.
కచా బాదమ్ సాంగ్ - భుబన్ బాదయాకర్: 3830 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇదో బెంగాలీ - హర్యాన్వీ రీమిక్స్ సాంగ్. భుబన్ బాదయాకర్ ఈ పాట పాడారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
లీ లీ ఆయీ కోకో కోలా: 3130 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇదో బోజ్‌పురి సాంగ్. లాల్ యాదవ్, శిల్పరాజ్ పాడారు.
ఊ బోలేగా యా ఊఊ బోలేగా: పుష్ప హిందీ వెర్షన్ సాంగ్. దీనికి 3440 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఊ అంటావా మావా... ఊఊ అంటావా: ఇది పుష్పలో వచ్చిన పాటే. దీనికి 2630 లక్షల వ్యూస్ వచ్చాయి.
కోక్ స్టూడియో(సీజన్ 14) - పాసోరీ: 4560 లక్షల వ్యూస్ వచ్చాయి. పంజాబీ - ఉర్దూ ఆల్బమ్ సాంగ్ ఇది. పాకిస్థానీ సింగర్స్ అలీ సేథీ, సహేయి గిల్ పాడారు.
అరబిక్ కుతు - బీస్: 3420 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇదో తెలుగు పాట కాగా ఈ ఏడాది ఏప్రిల్ 13న సినిమా విడుదలైంది.
నాథునియా: 2570 లక్షల వ్యూస్‌ని మూటగట్టుకుంది. ఇది కడా మరో భోజ్‌పురి పాట. కిషోరీ లాల్ యాదవ్ పాడారు. ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా విడుదలైంది.
Updated Date - 2022-12-31T05:15:47+05:30 IST