ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan Harish Shankar combo: ఈ కాంబో.. కల కాదుగా!

ABN, First Publish Date - 2022-11-27T02:34:23+05:30

‘గబ్బర్‌ సింగ్‌’తో పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ల కాంబో ఓ సంచనలం సృష్టించింది. ఇప్పటికీ.. పవన్‌ అభిమానులు ఆ సినిమాని తలచుకొంటూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గబ్బర్‌ సింగ్‌’తో పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ల కాంబో ఓ సంచనలం సృష్టించింది. ఇప్పటికీ.. పవన్‌ అభిమానులు ఆ సినిమాని తలచుకొంటూనే ఉన్నారు. మరోసారి వీరిద్దరూ జట్టు కడితే చూడాలని వారి ఆశ. దానికి తగ్గట్టుగానే మైత్రీ మూవీస్‌ పతాకంపై ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే సినిమా కూడా ప్రకటించారు. అయితే ‘భవదీయుడు’కి అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని పక్కన పెట్టారు. దాంతో పవన్‌ - హరీశ్‌ కాంబో చూడాలేమేమో..? అనుకొన్నారు ఫ్యాన్స్‌. మళ్లీ ‘తేరి’ రీమేక్‌ తెరపైకి వచ్చింది. ఈ రీమేక్‌తో పవన్‌, హరీశ్‌ ఇద్దరూ కలుస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ రీమేక్‌ ప్రయత్నాలూ ఆగిపోయాయి. మళ్లీ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి పవన్‌ - హరీశ్‌ మధ్య కథా చర్చలు మొదలయ్యాయని టాక్‌. పవన్‌ చెప్పిన ఓ ఐడియాని, హరీశ్‌ కథగా మలచడంలో బిజీ అయ్యారని, ‘హరి హర వీరమల్లు’ పూర్తయిన వెంటనే హరీశ్‌ కథని పట్టాలెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈసారైనా ఈ కాంబో కల.. నిజమవుతుందేమో చూడాలి.

Updated Date - 2022-11-27T02:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising