ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ అపోహలు

ABN, First Publish Date - 2022-01-25T05:30:00+05:30

ఒమైక్రాన్‌ గురించిన పరిజ్ఞానం సాధించాం. అయినప్పటికీ ఒమైక్రాన్‌ గురించిన కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వేరియెంట్‌ గురించిన అలాంటి కొన్ని అపోహలు, వాస్తవాలు ఇవే!...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమైక్రాన్‌ గురించిన పరిజ్ఞానం సాధించాం. అయినప్పటికీ ఒమైక్రాన్‌ గురించిన కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వేరియెంట్‌ గురించిన అలాంటి కొన్ని అపోహలు, వాస్తవాలు ఇవే!

అపోహ: ఒమైక్రాన్‌ స్వల్ప ఇన్‌ఫెక్షన్‌కే పరిమితం

వాస్తవం: డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమైక్రాన్‌ తక్కువ తీవ్రత కలిగినదే అయినప్పటికీ, అలక్ష్యం చేయగలిగేటంత తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌ కాదు. వ్యాక్సిన్‌ను ఛేదించుకుని వ్యాపిస్తున్న ఒమైక్రాన్‌, పూర్వపు వేరియెంట్ల మాదిరిగానే రిస్క్‌ గ్రూపుకు చెందిన వారికి (హృద్రోగులు, మధుమేహులు, తీవ్ర వ్యాధిగ్రస్థులు) ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

అపోహ: వ్యాక్సిన్లతో ఒమైక్రాన్‌ నుంచి రక్షణ దక్కదు

వాస్తవం: ప్రస్తుత ఒమైక్రాన్‌ వేరియెంట్ల నుంచి వ్యాక్సిన్‌ ద్వారా రక్షణ పొందవచ్చు. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికీ ఒమైక్రాన్‌ సోకే వీలున్నా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకోవడం తప్పనిసరి.

అపోహ: ఒమైక్రాన్‌ జలుబును కలిగించే వైరస్‌ లాంటిదే!

వాస్తవం: సాధారణ జలుబు కంటే ఒమైక్రాన్‌ ఎక్కువ ప్రమాదకారి. ఒమైక్రాన్‌ బారిన పడి కోలుకున్నవాళ్లకు లాంగ్‌ కొవిడ్‌ మాదిరిగా దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వెంటాడే వీలూ లేకపోలేదు. 

అపోహ: ఒకసారి కొవిడ్‌ సోకిన వాళ్లకు ఒమైక్రాన్‌ నుంచి రక్షణ ఉంటుంది.

వాస్తవం: కొవిడ్‌ సోకడం మూలంగా శరీరంలో ఉత్పత్తైన యాంటీబాడీలు ఒమైక్రాన్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి అనుకుంటే పొరపాటు. కొవిడ్‌ సోకినా, సోకకపోయినా ఒమైక్రాన్‌ నుంచి రక్షణ దక్కాలంటే కచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

Updated Date - 2022-01-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising