ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Faria abdullah: నో లిమిటేషన్స్‌.. నో కండీషన్స్‌

ABN, First Publish Date - 2022-10-28T18:59:22+05:30

‘నో లిమిటేషన్స్‌.. నో కండీషన్స్‌’ (No limitations- no conditions)అంటోంది ఫరియా అబ్దుల్లా (faria abdullah). ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైందీ హైదరాబాదీ అమ్మాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నో లిమిటేషన్స్‌.. నో కండీషన్స్‌’ (No limitations- no conditions)అంటోంది ఫరియా అబ్దుల్లా (faria abdullah). ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైందీ హైదరాబాదీ అమ్మాయి. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘బంగార్రాజు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించిన ఆమె అవకాశాలు వరుస కడతాయనుకున్నారంతా. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకునే ఈమెకు అడపాదడపా అవకాశాలే దక్కుతున్నాయి. తాజాగా సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కిన ‘లైక్‌ షేర్‌ సబ్‌స్ర్కైబ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణంగా తెలుగు ఆర్టిస్ట్‌లకు కొన్ని లిమిటేషన్స్‌ ఉంటాయి.. అలా మీరేమన్నా అవకాశాలు వదులుకుంటున్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘నాకు అలాంటి లిమిటేషన్స్‌.. కండీషన్స్‌ ఏమీ లేవు.. పెట్టుకోలేదు కూడా! నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. ఒకే జానర్‌కి పరిమితం కావాలని లేదు. యాక్షన్‌, సూపర్‌ నేచురల్‌, సైకో థ్రిల్లర్స్‌ ఇలా అన్ని జానర్‌లతో గేమ్‌ ఆడాలనుకుంటున్నా. పాత్ర డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ పాత్రలకు కూడా సిద్ధమే’’ అని ఫరియా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె రవితేజ ‘రావణాసుర’ (Ravanasura)చిత్రంలో నటిస్తోంది. ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లోనూ అవకాశం అందుకొంది. 


Updated Date - 2022-10-28T18:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising