ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవే ఆరాధన

ABN, First Publish Date - 2022-08-19T05:30:00+05:30

ఇతరులకు సేవ చేయడంలో ఒక రహస్యం ఉంది. దానివల్ల మనం దైవానికి సమీపించినట్టవుతుంది. సేవ కోసం మన చేతులను దేవుడు ఉపయోగించుకుంటున్నాడనే మార్మికమైన విషయాన్ని బైబిల్‌ బోధిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇతరులకు సేవ చేయడంలో ఒక రహస్యం ఉంది. దానివల్ల మనం దైవానికి సమీపించినట్టవుతుంది. సేవ కోసం మన చేతులను దేవుడు ఉపయోగించుకుంటున్నాడనే మార్మికమైన విషయాన్ని బైబిల్‌ బోధిస్తోంది. దేవుడు తన సేవకులను ఇష్టంతో తన చెంత చేర్చుకుంటాడు ప్రజలకు సేవలు అందించడానికి దేవుడు నేరుగా ప్రత్యక్షమైపోడు. దైవ ప్రణాళిక మన అంచనాలకు అతీతం. స్వార్థం వీడిన, పరోపకార చింతన కలిగిన తన సేవకుల ద్వారా ఆయన సాయ పడతాడు. ‘దేవుని సాయం’ అనే మాటకు అర్థం, పరమార్థం అదే.


సమస్యల్లో ఎన్నో రకాలు ఉన్నట్టే... సేవలు కూడా బహురూపాల్లో, వివిధ వ్యక్తుల ద్వారా అందుతాయి. ‘‘అన్నిటికీ ఒకటే ఆత్మ. అదే సేవాతత్పరత కలిగిన, ప్రేమపూరితమైన పవిత్ర ఆత్మశక్తి. ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆత్మ శక్తి ఏ విధంగానైనా సరే తన మార్గాలను వెతుక్కొని సేవలు అందిస్తుంది’’ అని బైబిల్‌ చెబుతోంది. 


ఏసు ప్రభువు తన జీవితంలో ఎక్కువకాలం సేవా మార్గంలోనే గడిపాడు. తాను ఏదైతే బోధించాడో, దాన్ని సేవా రూపంలో చేసి చూపించాడు. పక్షవాత రోగికి నయం చేసి, నడిచి వెళ్ళమన్నాడు. కళ్ళు లేని వ్యక్తికి చూపు అందించి, లోకాన్ని చూడమన్నాడు. మృత జీవికి పునర్జీవ భాగ్యం కలిగించాడు. ఇవన్నీ బాహ్య సేవలకు సంకేతాలు. కానీ మానసిక రుగ్మతలను కూడా ఆయన గుర్తించి, తగిన ఆధ్యాత్మక చికిత్స చేశాడు. సేవా మార్గంలో తనను అనుసరించాలనే సందేశం ఇచ్చాడు. 


సేవారహితమైన ఆరాధనలు, ఇతరుల పట్ల కనీసమైన ప్రేమ కూడా లేని ప్రసంగాలు ప్రభువుకు ప్రీతిపాత్రం కావు. ఆకలైనవాడికి పట్టెడు అన్నం పెట్టాలనీ, ఖైదులో ఉన్నవారికి వారి దోషాలను సరిదిద్దుకొని కొత్త జీవితాన్ని సాగించే అవకాశం కల్పించాలనీ, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలనీ... అటువంటి సేవే భక్తి రూపంలో తన దగ్గర చెల్లుబాటు అవుతుందనీ చెప్పాడు. ఆయన దృష్టిలో సేవలేని విశ్వాసం నిరర్థకం. తన చెంతకు వచ్చేవారు ముందుగా, సమస్యలలో చిక్కుకున్న వారిని పలకరించి, ఓదార్చి, ధైర్యం చెప్పి, తగిన సేవలు చేయాలని ఆయన ఆదేశించాడు. ఎందుకంటే సేవే గొప్ప ఆరాధన. సమాజంలో దిక్కులేనివారు, కూటికి నోచనివారు ఎందరో ఉన్నారు. మానసిక కల్లోలాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. అటువంటి వారికి సాయం చేసినప్పుడే... ‘క్రీస్తు అనుచరులం’ అని చెప్పుకొనే అర్హత ఉంటుంది. 


డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising