ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయానికి మార్గం

ABN, First Publish Date - 2022-07-29T07:42:35+05:30

మన జీవితాన్ని గెలుపు, ఓటములతో ముడిపెడుతూ ఉంటాం. అనుకున్నది సఫలమయితే గెలిచేమనుకుంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న జీవితాన్ని గెలుపు, ఓటములతో ముడిపెడుతూ ఉంటాం. అనుకున్నది సఫలమయితే గెలిచేమనుకుంటాం. ‘మనోవాంఛా ప్రాప్తిరస్తు’ అని పెద్దలు కూడా దీవిస్తూ ఉంటారు, అంటే మన మనస్సులోని కోర్కెలు తీరాలని. ప్రతి అక్కరూ తమ కోర్కెలన్నీ తీరాలనుకుంటారు. కానీ అన్నీ పూర్తిగా తీర్చుకొనేవారెవరూ ఉండకపోవచ్చు.


మనస్సు చంచలమైనది. అది నిత్యం మారుతూ ఉంటుంది. ఏదైనా దుకాణంలో చీరో, చొక్కానో కొనడానికి వెళ్ళినప్పుడు... ఏది కనిపిస్తే అది కొనెయ్యరు కదా! నచ్చేది దొరికేవరకూ చూస్తూనే ఉంటారు. ఇదంతా మనసు ఆడించే ఆట. ఇలా అందరి జీవితాల్లోనూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంతకూ విజయం అంటే ఏమిటి?  మనసులోని కోర్కెలు తీరితేనే విజయం సాధించినట్టూ, లేకపోతే ఓటమి పాలైనట్టూ అనుకుంటాం. కానీ జీవితం అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే... మనసును కాకుండా హృదయాన్ని ఆధారంగా చేసుకొని జీవించడం మొదలుపెట్టాలి. 


మనలో మనసూ ఉంది, హృదయమూ ఉంది. మనసు అడుగుజాడల్లో నడవడం అందరూ నేర్చుకున్నారు. మిగిలింది ఒక్కటే... హృదయం జాడల్లో నడవడం. హృదయ పయనంలో ధనిక-పేద, చిన్న-పెద్ద అనే తారతమ్యాలేవీ ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ అపారమైన శాంతి, అపరిమితమైన ఆనందం నిక్షిప్తమై ఉన్నాయి ఆ నిక్షేపాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే... హృదయదాహం సమసిపోతుంది. అంతేతప్ప పుస్తక పఠనం వల్లనో, మంచి మాటలు వినడం వల్లనో అది ఎన్నటికీ తీరదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. కానీ అనుభవమే లోపించింది. 


మీరు ఓటమి పాలు కాకూడదనుకుంటే... అసలైన విజయం అంటే ఏమిటో ముందుగా తెలుసుకోండి. అసలైన విజయం సాధించడం కోసం... ముందుగా మీ హృదయానికి శాంతి చేకూర్చండి. హృదయం పిలుపును ఆలకించండి. ఈ విషయాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే... గెలుపు సాధించామని సంబరపడిన మరుక్షణమే... ఓటమి పాలైనట్టు అసంతృప్తికి గురవుతాం. ఇలా చాలాసార్లు జరుగుతుంది. జీవితంలో అసలైన విజయం అంటే ఏమిటో, అదెలా సాధ్యమవుతుందో తెలుసుకోనంతవరకూ... ఓటమిపాలైనట్టే జీవనం సాగిస్తూ ఉంటాం. విజయాన్ని ఏనాడూ రుచి చూడకుండా మరణిస్తే... ఇక ఈ జీవితంలో ఏం సాధించినట్టు? ఈ జీవితం ఎందుకు లభించినట్టు?


నిజానికి మనం జన్మించి, ఇప్పటివరకూ సజీవంగా ఉండడం అంటేనే... విజయం మనల్ని వరించినట్టు! దీనిలో గెలుపు ఓటములతో పనిలేదు. పోరాడకపోయినా మనల్ని విజయం వరించింది, కాబట్టే జీవించి ఉన్నాం. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఏనాడైతే మనసును కాకుండా హృదయాన్ని శాంతపరుస్తారో... అప్పుడు ఓటమి ఎరుగని అసలైన విజయం మీ సొంతం అవుతుంది.

Updated Date - 2022-07-29T07:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising