ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్తూపాలు అంటే..

ABN, First Publish Date - 2022-04-22T05:31:06+05:30

మరణించిన వ్యక్తి శరీర ధాతువులను ఒక భరిణలో ఉంచి, దాని మీద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరణించిన వ్యక్తి శరీర ధాతువులను ఒక భరిణలో ఉంచి, దాని మీద చేపట్టే నిర్మాణం స్తూపం. ‘స్తూప్‌’ అంటే ‘చితిధాతువులను పోగు చేయడం’ అని అర్థం. ఇలా శరీర ధాతువుల మీద నిర్మించిన స్తూపాన్ని ‘చైత్యం’ అని కూడా అంటారు. బౌద్ధంలో నాలుగు రకాల స్తూపాలు ఉంటాయి.  మొదటివి... ధాతుగర్భ స్తూపాలు: బుద్ధుని లేదా బౌద్ధ భిక్షువుల శరీర ధాతువుల మీద నిర్మించినవి. ఇవి ధాతుగర్భాలు కాబట్టి బర్మా, శ్రీలంకల్లో వీటిని ‘డాగోబాలు’ అంటారు. రెండోవి... పారిభోజక స్తూపాలు. అంటే భిక్షువులు ఉపయోగించిన వస్తువుల మీద నిర్మించినవి. మూడోవి.. స్మృతి స్తూపాలు ఏదో ఒక భిక్షువుకు గుర్తుగా (స్మృతిగా) నిర్మాణం చేపట్టినవి.


ఇక నాలుగోవి... బౌద్ధారాధకులు ‘‘మేము కూడా ఒక స్తూపం నిర్మిస్తాం’’ అని మొక్కుకొని, బౌద్ధ క్షేతాల్లో నిర్మించేవి. వీటిని ‘ఉద్దేశిక స్తూపాలు’ అంటారు. ధాతుగర్భాలైన స్తూపాలను (చైత్యాలను) ‘దిబ్బలు’, ‘దిన్నెలు’ అని కూడా అంటారు. బుద్ధుడి ధాతువుల మీద మొదటగా ఏడు స్తూపాలు నిర్మించారు. తెలుగు ప్రాంతాల్లోని భట్టిప్రోలు, అమరావతి, ఆదుర్రు స్తూపాలు ధాతు స్తూపాలే! అమరావతి స్తూపాన్ని ‘దీపాల దిన్నె’ అని పిలుస్తారు. 

Updated Date - 2022-04-22T05:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising