ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivaradhana: బిల్వం...అందుకే పవిత్రం

ABN, First Publish Date - 2022-11-04T05:26:55+05:30

శివారాధనలో మారేడు లేదా బిల్వ పత్రానికి విశిష్టమైన స్థానం ఉంది. సుప్రసిద్ధమైన బిల్వాష్టకం... బిల్వ పత్రాల గొప్పతనాన్ని ఘనంగా ప్రస్తుతిస్తుంది. మారేడు చెట్టు ఎన్నో శతాబ్దాల నుంచి పవిత్రమైనదిగా పరిగణన పొందుతోంది. బిల్వ పత్రాలు లేనిదే శివ పూజ సంపూర్ణం కాదంటారు. బిల్వానికి ఉన్న త్రిపత్రాలు... అనేక రకాల త్రిత్వాలను... సృష్టి, స్థితి, లయలనూ, సాత్వికం, రాజసం, తామసం అనే త్రిగుణాలను, శివుని సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారంలోని మూడు అక్షరాలను, మహాదేవుడి మూడు నేత్రాలను, లేదా ఆయన ప్రీతీకాత్మకమైన ఆయుధం త్రిశూలాన్నీ సూచిస్తాయని అంటారు పెద్దలు.

Shivaradhana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సద్గురువాణి

శివారాధనలో మారేడు లేదా బిల్వ పత్రానికి విశిష్టమైన స్థానం ఉంది. సుప్రసిద్ధమైన బిల్వాష్టకం... బిల్వ పత్రాల గొప్పతనాన్ని ఘనంగా ప్రస్తుతిస్తుంది. మారేడు చెట్టు ఎన్నో శతాబ్దాల నుంచి పవిత్రమైనదిగా పరిగణన పొందుతోంది. బిల్వ పత్రాలు లేనిదే శివ పూజ సంపూర్ణం కాదంటారు. బిల్వానికి ఉన్న త్రిపత్రాలు... అనేక రకాల త్రిత్వాలను... సృష్టి, స్థితి, లయలనూ, సాత్వికం, రాజసం, తామసం అనే త్రిగుణాలను, శివుని సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారంలోని మూడు అక్షరాలను, మహాదేవుడి మూడు నేత్రాలను, లేదా ఆయన ప్రీతీకాత్మకమైన ఆయుధం త్రిశూలాన్నీ సూచిస్తాయని అంటారు పెద్దలు. మరి ఎన్నో ఆకులు ఉండగా... మారేడు ఆకుకు ఈ గౌరవం ఎందుకు వచ్చింది? అన్నీ మట్టి నుంచే వచ్చినప్పుడు... ఒక ఆకు కన్నా మరో ఆకు ఎలా పవిత్రమవుతోంది?

ఈ లోకంలోని ప్రతీదీ మట్టిలో నుంచే వస్తోంది. వేపకాయ, మామిడికాయ... ఈ రెండూ మట్టిలో నుంచే వస్తాయి. కానీ రుచులు వేరుగా ఉంటాయి. మట్టిని పరివర్తన చేసే తీరు ఒక జీవానికీ, మరో జీవానికీ భిన్నంగా ఉండడమే దీనికి కారణం. పదార్థం ఒక్కటే. దాని నుంచి మనం ఏం తయారు చేస్తామనేదే వ్యత్యాసానికి కారణం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమకు సాధ్యమైన అన్ని విధాలుగానూ సహకారం తీసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో... గమనించడం ద్వారా, ధ్యానం ద్వారా మనకు సహకరించే ప్రతిదాన్నీ గుర్తించారు. పువ్వులను, పండ్లను, ఆకులను సైతం వారు వదిలిపెట్టలేదు. బిల్వ పత్రాన్ని శివప్రీతికరంగా గుర్తించారంటే... మనం దేనినైతే ‘శివ’ అంటామో దానికి... బిల్వపత్రం తాలూకు ప్రకంపనలు దగ్గరగా ఉన్నాయని అర్థం.

ఇలాంటి ఎన్నో పదార్థాలను మనం గుర్తించాం. దేవతలకు వాటిని మాత్రమే సమర్పిస్తాం. ఎందుకంటే దైవ సామీప్యాన్ని పొందడానికి అవి మనకు మాధ్యమాలు అవుతాయి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించాక... వాటిని అక్కడే వదిలెయ్యకూడదు. మారేడు ఆకును శివలింగం మీద ఉంచాలి. మనతో పాటు తీసుకువెళ్ళాలి.

శివుడి ప్రకంపనలను చాలాకాలం పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో పాటే ఉంటుంది. ఆరోగ్యపరంగా, శ్రేయస్సు పరంగా, మానసికపరంగా... అన్ని విధాలుగా ఎంతో మార్పు తెస్తుంది. ఇలా పవిత్ర సాధనాలుగా గుర్తింపు పొంది, జన వినియోగంలో ఉన్న పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా దేవుడికి సంబంధించిన విషయం కాదు. ఇది మీకూ, అత్యున్నత స్థితిని అందుకొనే మీ సామర్థ్యానికీ సంబంధించిన విషయం.

-సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2022-11-04T05:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising